చిరూ బర్త్ డే.. ఫ్యాన్స్ కు మెగా బ్లాస్టింగ్
ఆరు పదుల వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలకు పోటీగా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 2 Aug 2025 10:28 AM ISTఆరు పదుల వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలకు పోటీగా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిరూ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. వాటిలో ఇప్పటికే విశ్వంభర సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు మెగాస్టార్. త్వరలోనే మెగా157కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మెగా157 షూటింగ్ ను సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లా నడిపిస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.
చిరూ క్రేజీ లైనప్
ఈ రెండు సినిమాల తర్వాత దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా, వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబీ కొల్లితో చిరూ సినిమాలను చేయనున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ సినిమాగా వస్తోన్న విశ్వంభర సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుండగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రానున్న మెగా157 వచ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్ గా రానుంది.
చిరూ బర్త్ డే ట్రీట్
అయితే ఇక అసలు విషయానికొస్తే టాలీవుడ్ లో సెలబ్రిటీల పుట్టినరోజును పురస్కరించుకుని వారి సినిమాల గురించి ఏవొక అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ కు చిత్ర మేకర్స్ సర్‌ప్రైజ్ ఇస్తారనే విషయం తెలిసిందే. ఆగస్ట్ 22 న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ఈసారి ఆగస్ట్ 22న మెగా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టే అప్డేట్స్ రాబోతున్నట్టు తెలుస్తోంది.
ఫ్యాన్స్ ను సర్‌ప్రైజ్ చేయనున్న విశ్వంభర
అందులో భాగంగానే విశ్వంభర నుంచి ఓ చిన్న వీడియోతో పాటూ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ వీడియో రానుందట. విశ్వంభర రిలీజ్ డేట్ కోసం మెగా ఫ్యాన్స్ తో పాటూ సాధారణ సినీ ప్రియులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. త్రిష, ఆషికా రంగనాథన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా, యువి క్రియేషన్స్ విశ్వంభరను భారీ బడ్జెట్ తో నిర్మించింది.
మెగా157 టైటిల్ కూడా..
దాంతో పాటూ సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ తర్వాత అనిల్ రావిపూడి చేస్తున్న మెగా157 నుంచి కూడా చిరూ బర్త్ డే సందర్భంగా అప్డేట్ రానున్నట్టు సమాచారం. ఆగస్ట్ 22న మెగా157 టైటిల్ తో పాటూ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ను కూడా చిత్ర యూనిట్ అనౌన్స్ చేయనుందట. ఈ రెండింటితో పాటూ మెగా158 ను కూడా ఆ రోజే అధికారికంగా ప్రకటించనున్నారట. మొత్తానికి ఈ సారి మూడు అప్డేట్స్ తో చిరూ బర్త్ డే కు ఫ్యాన్స్ కు ఫుల్ బ్లాస్టింగ్ కన్ఫర్మ్ అన్నమాట.
