Begin typing your search above and press return to search.

మెగాస్టార్‌ బర్త్‌డే కోసం..!

మెగా అభిమానులకు పండుగ రోజు రాబోతుంది. మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజును మెగా ఫ్యాన్స్ అత్యంత వైభవంగా, పండుగగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

By:  Ramesh Palla   |   21 Aug 2025 4:38 PM IST
మెగాస్టార్‌ బర్త్‌డే కోసం..!
X

మెగా అభిమానులకు పండుగ రోజు రాబోతుంది. మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజును మెగా ఫ్యాన్స్ అత్యంత వైభవంగా, పండుగగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏడాది ఆగస్టు 22న చేసుకున్నట్లుగానే ఈ ఏడాదిలో కూడా చిరంజీవి పుట్టిన రోజు వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న మెగా అభిమానులు బాస్‌ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉండే మెగా ఫ్యాన్స్ సైతం పెద్ద ఎత్తున కార్యక్రమాలను ప్లాన్‌ చేశారు. అభిమానులు ఎక్కడికి అక్కడ ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక మెగాస్టార్‌ చిరంజీవి సైతం తన ఫ్యామిలీతో కలిసి బర్త్‌డే వేడుక జరుపుకునేందుకు గాను రెడీ అయ్యారు. అందుకోసం ఫ్యామిలీ మొత్తం గోవా వెళ్లినట్లు సమాచారం అందుతోంది.

గోవాలో మెగాస్టార్‌ పుట్టిన రోజు వేడుక

మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యామిలీతో కలిసి గోవా వెళ్లి అక్కడ రెండుమూడు రోజుల పాటు బర్త్‌ డే వేడుకల్లో పాల్గొంటారు. గత కొన్ని వారాలుగా రెగ్యులర్‌గా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. విశ్వంభర పాట షూటింగ్‌, ఆ వెంటనే అనిల్‌ రావిపూడి సినిమా షూటింగ్ కార్యక్రమాల్లో చిరంజీవి పాల్గొంటున్నాడు. ఏమాత్రం గ్యాప్‌ ఇవ్వకుండా చిరంజీవి బిజీ బిజీగా గడుపుతున్నారు. మధ్య మధ్యలో టాలీవుడ్‌ సమస్యల గురించి మీటింగ్‌లను సైతం ఏర్పాటు చేసి తనవంతు సహకారం అందిస్తున్నారు. మొత్తానికి చిరంజీవి తన బర్త్‌డే తో కాస్త విశ్రాంతి తీసుకోబోతున్నారు. వీకెండ్‌ వరకు గోవాలోనే మెగా ఫ్యామిలీ మొత్తం ఉంటుంది అని మెగా కాంపౌండ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

పెద్ది షూటింగ్‌కి బ్రేక్‌ ఇచ్చిన రామ్‌ చరణ్‌

చిరంజీవి ప్రతి బర్త్‌డేకి ఫ్యామిలీ అంతా కలిసి ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఈసారి కూడా గోవాలో మెగా ఫ్యామిలీ మధ్య చిరంజీవి తన పుట్టిన రోజు వేడుక జరుపుకోబోతున్నారు. ఇప్పటికే పెద్ది సినిమా షూటింగ్‌కి బ్రేక్‌ ఇచ్చి చరణ్‌ గోవా వెళ్లారు అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రత్యేక విమానంలో చిరంజీవి ప్రయాణం ఉండబోతుంది. మరో వైపు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన రెండు సినిమాలకు సంబంధించిన బిగ్‌ అప్‌డేట్స్ ను ఇవ్వబోతున్నారు. ఇప్పటికే చిరంజీవి విశ్వంభర సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో రాబోతున్నట్లు ప్రకటించారు. విశ్వంభర టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

విశ్వంభర రిలీజ్ డేట్‌ పై క్లారిటీ

విశ్వంభర సినిమాతో పాటు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్నారు. వెంకటేష్‌తో సంక్రాంతికి వస్తున్నాం వంటి బ్లాక్ బస్టర్‌ విజయాన్ని అందుకున్న అనిల్‌ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించడం, ఈ సినిమా కూడా సంక్రాంతికి రాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. 2026 సంక్రాంతికి రాబోతున్న చిరు అనిల్‌ మూవీ టైటిల్‌ ని రేపు రివీల్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వరప్రసాద్‌ గారు అనే టైటిల్‌ ను ఇప్పటికే దర్శకుడు అనిల్‌ రావిపూడి కన్ఫర్మ్‌ చేశాడు. ఆ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. ఆమెతోనూ అనిల్‌ రావిపూడి ప్రమోషనల్‌ వీడియోలు చేయించాడు. షూటింగ్‌ గ్యాప్‌లో ఇప్పుడు కూడా చేయిస్తూనే ఉన్నాడని తెలుస్తోంది.