Begin typing your search above and press return to search.

మెగా డాటర్స్ తో మొదలైన చిరు బర్త్‌డే బజ్.. ఫ్యాన్స్ తో ఇలా..

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజుకు ఇంకా రెండు రోజుల సమయం ఉంది. కానీ అభిమానుల సెలబ్రేషన్స్ మాత్రం అప్పుడే మొదలయ్యాయి.

By:  M Prashanth   |   20 Aug 2026 6:05 PM IST
మెగా డాటర్స్ తో మొదలైన చిరు బర్త్‌డే బజ్.. ఫ్యాన్స్ తో ఇలా..
X

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజుకు ఇంకా రెండు రోజుల సమయం ఉంది. కానీ అభిమానుల సెలబ్రేషన్స్ మాత్రం అప్పుడే మొదలయ్యాయి. చిత్రపురి కాలనీలో చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ముందుగానే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు చిరు కుమార్తె సుస్మిత కొణిదెల, నిహారిక కొణిదెల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు.

అయితే ఈ కార్యక్రమం కేవలం కేక్ కటింగ్‌తోనే ఆగిపోలేదు. చిరంజీవి బర్త్‌డే సందర్భంగా రక్తదానం చేసిన వారికి సుస్మిత, నిహారిక సర్టిఫికెట్స్ అందించారు. చిరు పేరు దగ్గర రక్తదానం అనే విషయం కొత్త కాదు. చాలా ఏళ్లుగా ఆయన అభిమానులు పుట్టినరోజు సమయంలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈసారి కూడా అదే కొనసాగుతోంది.

సుస్మిత ప్రస్తుతం సినిమాల నిర్మాణం వైపు ఎక్కువగా ఉంటోంది. చిరంజీవికి సంబంధించిన సినిమాల్లో కాస్ట్యూమ్ డిజైనర్‌గా కూడా పని చేశారు. మరోవైపు నిహారిక నటిగా కెరీర్ మొదలుపెట్టి తర్వాత నిర్మాతగా మారింది. ఇలా మెగా ఫ్యామిలీ నుంచి ఇద్దరూ కలిసి చిరు అభిమానుల కార్యక్రమానికి రావడంతో అక్కడ మరింత సందడి కనిపించింది.

ఇక చిరంజీవి బర్త్‌డే దగ్గరపడితే మెగా ఫ్యాన్స్ నుంచి పోస్టర్స్, కామన్ డీపీలు, స్పెషల్ వీడియోలు వరుసగా వస్తుంటాయి. కానీ వాటితో పాటు రక్తదానం లాంటి కార్యక్రమాలు కూడా ప్రతి ఏడాది కనిపిస్తూనే ఉంటాయి. ఈసారి చిత్రపురి కాలనీలో జరిగిన వేడుకలో కూడా అదే కనిపించింది. రక్తదానం చేసిన వారిని ప్రత్యేకంగా పిలిచి సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది.

ఇక చిరంజీవి ప్రస్తుతం సినిమాలతో కూడా బిజీగానే ఉన్నారు. ఒకవైపు బాబీ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్టు లైన్లో ఉండగా, మరోవైపు ఆయన పుట్టినరోజు సందర్భంగా నెక్స్ట్ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. దీంతో ఆగస్ట్ 22 దగ్గరపడుతున్న కొద్దీ సోషల్ మీడియాలో కూడా మెగా హంగామా పెరుగుతోంది. ఇక అసలు రోజు వచ్చేలోపు ఇంకా ఎన్ని సెలబ్రేషన్స్, సినిమా అప్డేట్స్ వస్తాయో చూడాలి.