Begin typing your search above and press return to search.

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

గత కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళ నలుగురిని కలిపి సినిమా చేయడానికి చాలామంది దర్శకులు ప్రొడ్యూసర్లు ఆసక్తి చూపిస్తున్నప్పటికి అది కార్యరూపం దాల్చడం లేదు.

By:  Gopi Velupala   |   5 Nov 2026 1:00 AM IST
చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?
X

గత 4 దశాబ్దాలుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని, తరాలు మారుతున్న బాక్సాఫీస్ వద్ద తిరుగులేని స్టార్లుగా వెలుగొందుతున్న నలుగురు దిగ్గజాలు చిరంజీవి,బాలయ్య, వెంకటేష్, నాగార్జున. ఇతర భాషల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర వహించారు. సీనియర్ హీరోలుగా గుర్తింపును సంపాదించుకున్న ఈ నలుగురు హీరోలు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలతో పోటీ పడుతున్నారు. ఇప్పటికీ వాళ్ల నుంచి వచ్చే సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయగలుగుతున్నాయి.

రైటర్లకి సవాలుగా మారిందా

గత కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళ నలుగురిని కలిపి సినిమా చేయడానికి చాలామంది దర్శకులు ప్రొడ్యూసర్లు ఆసక్తి చూపిస్తున్నప్పటికి అది కార్యరూపం దాల్చడం లేదు. కారణం ఏంటంటే ఈ నలుగురు ఇమేజ్ ను బ్యాలెన్స్ చేస్తూ ఒక కథని రాయడం అనేది అసాధ్యం. ఒకరి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ పెరిగితే మరొకరి కి ప్రాధాన్యత తగ్గిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ కథను హ్యాండిల్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని ఇప్పటికే చాలామంది రైటర్లు ప్రయత్నించి వదిలేసారు...

ఈ నలుగురిని కలిపే దర్శకులు ఉన్నారా?

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ నలుగురితో సపరేట్ గా సినిమాలను చేస్తున్న దర్శకులు ఉన్నారు. కానీ వీళ్ళను కలిపి సినిమాలను చేయగలిగే దర్శకులు ఎవరున్నారు అనే దోరణిలో కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళికి ఈ నలుగురిని హ్యాండిల్ చేసే కెపాసిటి ఉంది. కానీ ప్రస్తుతం ఆయన వరల్డ్ సినిమా స్థాయికి వెళ్తున్నాడు. కాబట్టి ఈ నలుగురితో సినిమా చేయడం కష్టమనే చెప్పాలి.

ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే రీసెంట్ గా 'జైలర్ 2' సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన నెల్సన్ కి సైతం ఈ నలుగురి ఇమేజ్ ను హ్యాండిల్ చేస్తూ సక్సెస్ ని సాధించగలిగే కెపాసిటి ఉంది. కానీ దానికి తగ్గట్టు కథ దొరకాలి. అలాంటి కథని కనుక రాసుకోగలిగితే మాత్రం నెల్సన్ ప్రతి ఒక్కరి ఇమేజ్ కి తగ్గట్టుగా వాళ్ళను డిఫరెంట్ స్టైల్ లో చూపించే ప్రయత్నం చేస్తాడు. జైలర్ 2 రజనీకాంత్ ను డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తూ, భారీ లెవెల్లో ఎలివేట్ చేస్తూ ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేశాడు...