చిరంజీవి..బాలకృష్ణ ఒకే స్ట్రాటజీ!
సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి ..నటసింహ నందమూరి బాలకృష్ణ కెరీర్ పరంగా ఒకే రకమైన ఆసక్తికర వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.
By: Srikanth Kontham | 28 Aug 2026 12:00 AM ISTసీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి ..నటసింహ నందమూరి బాలకృష్ణ కెరీర్ పరంగా ఒకే రకమైన ఆసక్తికర వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ప్రయోగాలు చేయడం కంటే బలమైన మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్లపైనే ఇద్దరు దిగ్గజా లు నమ్మకంతో ముందుకెళ్తున్నారు. గతంలో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించిన దర్శకులతోనే రిపీటెడ్ కొలాబరేషన్స్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే చిరంజీవి కెరీర్‌లో మరోసారి దర్శకుడు బాబి తో సినిమా చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కలయికలో రిలీజ్ అయిన `వాల్తేరు వీరయ్య` ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే.
వరుస ప్లాప్ ల్లో ఉన్న చిరంజీవికి పడిన విజయం ఇది. అదే సక్సెస్ సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ మరోసారి బాబి దర్శకత్వంలోనే `కాకా` సినిమా చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు. గతంలో `వీర సింహా రెడ్డి` వంటి భారీ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో బాలయ్య మరోసారి చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో ఓకొత్త ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సక్సెస్ ఇచ్చిన దర్శకుడితో మళ్లీ సినిమా చేయడం ద్వారా బాక్సాఫీస్ సక్సెస్‌కు మరింత గ్యారంటీ ఉంటుందనేది స్ట్రాటజీగా కనిపిస్తోంది.
దర్శకులను రిపీట్ చేయడమే కాదు. కథల ఎంపికలోనూ ఇద్దరు సీనియర్ హీరోలు ఒకే విధమైన జోనర్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం గ్యాంగ్‌స్టర్ డ్రామాలు ...మాఫియా కథలనే నమ్ముకుంటున్నారు. ప్రేక్షకులకు కావాల్సిన మాస్ ఎలివేషన్లు, పవర్ ఫుల్ డైలాగులు, హై-ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో కూడిన కథలను ఎంచుకుని అభి మానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తరహా రిపీటెడ్ కాంబినేషన్లు, గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్ కథలు ట్రేడ్ వర్గాలలో కూడా భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. నిర్మాతలు కూడా ఈ కాంబినేషన్లపై పెట్టుబడులు పెట్టడానికి అమితాసక్తి చూపిస్తున్నారు. సీనియర్ హీరోల మార్కెట్ స్థాయి ఏమాత్రం తగ్గకుండా.. వారి మాస్ ఇమేజ్‌ను మరింత ఎలివేట్ చేసేలా ఈ ప్రాజెక్ట్‌లు రూపుది ద్దుకుంటున్నాయి. ఇండస్ట్రీలో నిలకడైన విజయాలను సాధించడానికి ఈ ఫార్ములా ఎంతగానో ఉపయోగ పడుతుందని మరోసారి నిరూపితమవుతోంది.
చిరంజీవి - బాలకృష్ణ ఒకే రకమైన సక్సెస్ ఫార్ములాను అనుసరిస్తూ టాలీవుడ్‌లో సరికొత్త మార్గాలకు బాటలు వేస్తున్నారు. ఒకరినొకరు పోటీపడుతూనే తమదైన శైలి మాస్ సినిమాలతో బాక్సాఫీస్ కు షాక్ ఇస్తున్న ఇద్దరు సీనియర్ స్టార్ల వ్యూహం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్ లో ఈ మాస్ కాంబినేషన్లు ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి.
