చిరు వర్సెస్ బాలయ్య: 2026 లో ధీటుగానే!
మెగాస్టార్ చిరంజీవి-నటసింహ బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద తలపడి చాలా కాలమవుతుంది. ఈ మధ్య కాలంలో ఇద్దరి హీరోల సినిమాలు క్లాష్ అవ్వకుండా రిలీజ్ అవుతున్నాయి.
By: Srikanth Kontham | 24 Oct 2025 8:15 AM ISTమెగాస్టార్ చిరంజీవి-నటసింహ బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద తలపడి చాలా కాలమవుతుంది. ఈ మధ్య కాలంలో ఇద్దరి హీరోల సినిమాలు క్లాష్ అవ్వకుండా రిలీజ్ అవుతున్నాయి. ఏడాదికి ఒక సినిమా రిలీజ్ అయినా ఆరోగ్యకరమైన వాతావరణంలో పోటీ లేకుండా రిలీజ్ అవుతున్నాయి. ఒకవేళ క్లాష్ వచ్చే అవకాశం ఉన్నా? రాకుండా దర్శక, నిర్మాతలు ప్రీ ప్లాన్డ్ గా ఉంటున్నారు. కానీ 2026 లో మాత్రం మరోసారి ఇద్దరి మధ్య క్లాష్ తప్పదనే వార్త వినిపిస్తోంది. ఇప్పటి వరకూ ఒక లెక్క..ఇకపై మరో లెక్క అంటూ ఇద్దరు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద కాలు దువ్వే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతుంది.
ఇద్దరు మాస్ సంచలనాలతో:
అందుకు ఇటీవల ఇద్దరి మధ్య చోటు చేసుకున్న సన్నివేశం కూడా మరో కారణంగా మాట్లాడుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి ఓ భారీ యాక్షన్ చిత్రానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. `వాల్తేరు వీరయ్య` తర్వాత ఇద్దరు చేతులు కలిపిన తరుణం ఇది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది పట్టాలెక్కించాలని రెడీ అవుతున్నారు. బాబి యాక్షన్ సినిమాలు ఎలా ఉంటాయి? అన్నది చెప్పాల్సిన పనిలేదు. పూర్తిగా మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఆయన కంటెంట్ ఉంటుంది. చిరంజీవి లాంటి మాస్ స్టార్ అంటే? బాబి కత్తికి పదును మరింతగా ఉంటుంది.
మాస్ ఇమేజ్ ఉన్న స్టార్లు:
అటు నటసింహ బాలయ్య కూడా రెండవ సారి గోపీచంద్ మలినేనితో చేతులు కలుపుతున్న సంగతి తెలిసిందే. `వీరసిహారెడ్డి` తర్వాత తగ్గేదే లే అంటూ బాలయ్య గోపీతో ఒప్పందం చేసుకున్నాడు. `అఖండ 2` పూర్తయిన తర్వాత తదుపరి పట్టాలెక్కించేది అతడి చిత్రమే. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో గోపీ బిజీగా ఉన్నాడు. `అఖండ2` నుంచి రిలీవ్ అవ్వగానే పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నాడు. గోపీచంద్ సినిమాలు ఎలా ఉంటాయి? అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఇతడు పక్కా మాస్ డైరెక్టర్. హీరో ఇమేజ్ తో కథను నడించే డైరెక్టర్.
వెయిట్ అండ్ సీ:
ఈ నేపథ్యంలో బాలయ్య-చిరు చిత్రాలు వచ్చే ఏడాది బాక్సాఫీస్ వద్దకు ఒకేసారి రిలీజ్ చేసేలా? ప్రణాళిక సిద్దమవుతుందా? అన్న సందేహాలు ఫిలిం సర్కిల్స్ లో వ్యక్తమవుతున్నాయి. మళ్లీ గత వైభవం చూడాలంటే? ఇలా ఇద్దరు స్టార్లు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే తప్ప మునుపటి ఊపు రాదని రిలీజ్ లు ఒకేరోజు కాకపోయినా? వారం గ్యాప్ లో రిలీజ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభిమాన సంఘాల మధ్య కూడా ఈ డిస్కషన్ మొదలైంది. దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే మరింత సమయం పడుతుంది.
