'జన నాయగన్' ఎఫెక్ట్.. చిరు సినిమాపై పడుతుందా?
అయితే విజయ్ హీరోగా నటించిన `జన నాగయన్` కారణంగా ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
By: Tupaki Entertainment Desk | 22 Jan 2026 10:28 PM ISTమెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి విడుదలైన `మన శంకర వరప్రసాద్‌గారు` బ్లాక్ బస్టర్‌తో మంచి జోష్‌మీదున్నారు. చాలా రోజుల తరువాత సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్ బస్టర్‌ని దక్కించుకోవడంతో రెట్టించి ఉత్సాహంతో కొత్త ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించడానికి సిద్ధమవుతున్నారు. `మన శంకర వరప్రసాద్‌గారు` తరువాత టాలెంటెడ్ డైరెక్టర్ బాబితో మరో భారీ యాక్షన్ డ్రామాని చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికారికంగా ప్రకటించడంతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బాబి, చిరుల కాంబినేషన్‌లో ఇంతకు ముందు `వాల్తేరు వీరయ్య` రూపొందిన విషయం తెలిసిందే. రవితేజ అతిథి పాత్రలో నటించిన ఈ మూవీ 2023, జనవరి 13న విడుదలై అనూహ్య విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్ల పైచిలుకు వసూళ్లని రాబట్టి బాబి, చిరులది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అని నిరూపించింది. ఈ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మరోసారి వీరిద్దరూ కలిసి ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత భారీ స్థాయిలో నిర్మించబోతోంది.
అయితే విజయ్ హీరోగా నటించిన `జన నాగయన్` కారణంగా ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్‌తో `జన నాయగన్`ని నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ మెగాస్టార్ - బాబీ సినిమాని నిర్మిస్తూ టాలీవుడ్‌లోకి ప్రవేశిస్తోంది. `జన నాయగన్` సెన్సార్ వివాదం కారణం రిలీజ్ ఆలస్యం అవుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కోసం నిర్మాణ సంస్థ కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ఆ కారణంగానే చిరు - బాబిల మూవీ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
`జన నాయగన్` వివాదాన్ని పరిష్కరించి సినిమాని థియేటర్లలోకి తీసుకొచ్చాకే చిరు సినిమాని ప్రారంభించాలని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ భావిస్తోందట. అయితే అంత వరకు చిరు, బాబీ వేచి చూస్తారా? అనే చర్చ టాలీవుడ్ సర్కిల్స్‌లో జరుగుతోంది. కానీ మేకర్స్ ప్లాన్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉందని ఇన్ సైడ్ టాక్. ప్రస్తుతం `జన నాయగన్` సెన్సార్ వివాదం జరుగుతున్నా కానీ చిరుతో అనుకున్న ప్రాజెక్ట్‌ని అనుకున్న టైమ్‌కు స్టార్ట్ చేయాలనే ఆలోచనలోమేకర్స్ ఉన్నారట. మే నుంచి ఈమూవీ రెగ్యులర్ షూటింగ్‌ని స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.
చిరు కెరీర్‌ని మరో మలుపు తిప్పే విధంగా సరికొత్త కథతో దీన్ని దర్శకుడు బాబి తెరపైకి తీసుకొస్తున్నారు. ఇందులో చిరకు జోడీగా ప్రియమణి నటిస్తుండగా, కూతురిగా `ఉప్పెన` బ్యూటీ కృతిశెట్టి నటించనుందని, ఇప్పటికే తనతో టీమ్ చర్చలు పూర్తి చేసిందని, ఈ సినిమా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందనుందని తెలిసింది.
