శివరామ్, అన్వీరా దేవి.. మెగా వారసుల పేర్ల వెనుక ఇంత లోతైన కథ ఉందా!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల కవలల నామకరణ వేడుక సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతోంది.
By: M Prashanth | 13 Feb 2026 4:03 PM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల కవలల నామకరణ వేడుక సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. జనవరి 31న పుట్టిన ఈ బుజ్జి మనవడు, మనవరాలి పేర్లను మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వెల్లడించారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఉన్న అందమైన ఫోటోను షేర్ చేస్తూ, ఆ చిన్నారుల పేర్ల వెనుక ఉన్న అసలు అర్థాలను మెగా టీమ్ అఫీషియల్ గా వివరించింది.
మెగా వారసుడికి ‘శివరామ్ కొణిదెల’ అని, వారసురాలికి ‘అన్వీరా దేవి కొణిదెల’ అని పేర్లు పెట్టారు. ఈ పేర్లను కేవలం వెరైటీ కోసం కాకుండా, ఫ్యామిలీ లెగసీని, ఆధ్యాత్మికతను బ్యాలెన్స్ చేస్తూ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. బాబు పేరు ‘శివరామ్’ వెనుక మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు దాగి ఉంది. చిరంజీవి గారి పుట్టినప్పటి పేరు ‘శివశంకర్ వరప్రసాద్’ లోని ‘శివ’ను, తండ్రి రామ్ చరణ్ పేరులోని ‘రామ్’ను కలిపి ఈ పేరును డిజైన్ చేశారు.
శివరామ్ పేరు అంటే కేవలం శక్తి మాత్రమే కాదు, నిగ్రహంతో కూడిన బలం అని వివరించారు. ఈ పేరుకు ఆధ్యాత్మికంగా మరో కనెక్షన్ కూడా ఉంది. ఉపాసన తండ్రి అనిల్ కామినేని పూర్వీకులు నిర్మించిన పురాతన ‘శివరామ్ ఆలయం’ నుండి కూడా ఈ పేరును స్ఫూర్తిగా తీసుకున్నారు. శివుడు ప్రతిబింబించే అంతర్గత శక్తి, రాముడు చూపించిన ధర్మం.. ఈ రెండింటి కలయికే ఈ పేరు అని మెగా ఫ్యామిలీ స్పష్టం చేసింది.
ఇక మెగా ప్రిన్సెస్ పేరు ‘అన్వీరా దేవి’ వెనుక కూడా ఒక పవర్ ఫుల్ స్టోరీ ఉంది. కనకదుర్గమ్మ ఆశీస్సులతో, సురేఖ గారికి అమ్మవారిపై ఉన్న భక్తితో ఈ పేరును సెలెక్ట్ చేశారు. అన్వీరా అంటే అపరిమితమైన ధైర్యం అని అర్థం. ఆ పేరు చివర ‘దేవి’ అని చేర్చడం వెనుక ఒక ప్రత్యేక ఉద్దేశం ఉందట. శక్తి దయ రెండూ ఒకే దగ్గర ఉండాలన్నది వారి ఆలోచన అని తెలుస్తోంది.
డెలివరీ వరకు ఉపాసన తన పనుల్లో బిజీగా ఉండటంపై కూడా ఆమె స్పందించారు. "నా పని నాకు ఒక పర్పస్ ఇస్తుంది, నా పిల్లలు నాకు ఆనందాన్ని ఇస్తారు" అని చెబుతూ తన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి వివరించారు. ప్రస్తుతం తన తదుపరి హాస్పిటల్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెడుతున్నట్లు తెలిపారు. అదే సమయంలో రామ్ చరణ్ తన పెద్ద కూతురు క్లీంకార బాధ్యతలను పూర్తిగా పంచుకుంటూ తనకు పెద్ద సపోర్ట్‌గా నిలుస్తున్నారని ఉపాసన మురిసిపోయారు.
ఇక చిరంజీవి అనౌన్స్‌మెంట్‌తో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. తమ మూలాలను మర్చిపోకుండా, పెద్దలపై గౌరవాన్ని చాటుతూ చరణ్ ఉపాసన తీసుకున్న ఈ నిర్ణయం అందరి ప్రశంసలు అందుకుంటోంది. శివరామ్, అన్వీరా దేవిల జీవిత ప్రయాణం అద్భుతంగా సాగాలని కోరుకుంటూ నెటిజన్లు శుభాకాంక్షలతో సోషల్ మీడియాను ముంచెత్తుతున్నారు.
