చిరు, శ్రీకాంత్.. మ్యూజిక్ ఎవరంటే?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 70 పదుల వయసులోనూ వరుస సినిమాలతో యువ హీరోలకు ఫుల్ పోటీ ఇస్తున్నారు.
By: M Prashanth | 23 Aug 2025 1:46 PM ISTటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 70 పదుల వయసులోనూ వరుస సినిమాలతో యువ హీరోలకు ఫుల్ పోటీ ఇస్తున్నారు. ఇప్పటికే రెండు సినిమాలు చేస్తుడంగా.. మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టారు. అలా ప్రస్తుతం చిరు లైనప్ నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో ఏ సీనియర్ హీరో కూడా ఇలా ఇన్ని సినిమాలు లైన్ లో పెట్టలేదు. దీంతో లైనప్ లో కూడా మెగాస్టార్ టాప్ అనిపించుకున్నారు.
అయితే ఈ లైనప్ లో ఆయన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లోనూ ఓ సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గతేడాదే అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటో కూడా ఒకటి శ్రీకాంత్ అప్పట్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చిరు చేతిలో చెయ్యేసి ఫేస్ లు బ్లర్ చేశారు. ఈ ఇద్దరి చేతులు రక్తంలో తడిసినట్లుగా చూపించారు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అలా చిరు చేతిలో ఇప్పుడు ఉన్న మొత్తం నాలుగు సినిమాలలో శ్రీకాంత్ ప్రాజెక్ట్ పైనే అంచనాలు మాత్రం పీక్స్ లో ఉన్నాయి.
ఈ క్రమంలో డైరెక్టర్ శ్రీకాంత్ నిన్న చిరు బర్త్ డే సందర్భంగా ఎక్స్ అకౌంట్ లో ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ మెగా ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహాన్ని నింపింది. చిరంజీవి అంటే జీవితకాలం ఆడే సినిమా అని, ఆయనతో సినిమా అంటే జీవితాంతం గుర్తుండిపోయేలా తీయడం తప్ప మరో ఆప్షన్ లేదు అని రాసుకొచ్చాడు. బిగ్ స్క్రీన్ పై చిరును ఇన్ని రోజులు మిస్ అయ్యాం. పక్కా ఆ చిరంజీవిని మళ్లీ బిగ్ స్క్రీన్ పై చూపిస్తా. నా లాంటి చిరు అభిమాని కోసం తీస్తున్న సినిమా ఇది అంటూ శ్రీకాంత్ రాసుకొచ్చాడు.
ఈ ట్వీట్ తోనే తెలుస్తుంది. ఆయన ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో. చిరు- ఓదెల ఇట్స్ బ్లడ్ ప్రామిస్ అంటూ ముగించాడు. దీంతో ప్రాజెక్ట్ భారీ రేంజ్ లో ఉండబోతుందని అర్థం అయిపోయింది. మరి ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్ కు సంగీత దర్శకడు ఎవరు అనేది ప్రస్తుతం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే చాలా మంది సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నారు.
అందరూ అనుకున్నట్లే అనిరుధే సినిమాకు సంగీతం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎలాగంటే ప్రస్తుతం శ్రీకాంత్ చేస్తున్ ది ప్యారడైజ్ సినిమాకు అనిరుధ్ మ్యాజిక్ డైరెక్టర్ కావడం విశేషం. అందుకే కంటిన్యూగా ఈ ప్రాజెక్ట్ కు కూడా అతడే సంగీతం ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇదే కన్ఫార్మ్ అయితే మెగాస్టార్- అనిరుధ్ కాంబినేషన్ లో మొదటి సినిమా ఇదే అవుతుంది. చూడాలి మరి ఈ ప్రాజెక్ట్ కు ఎవకు సంగీతం అందిస్తారో?
