Begin typing your search above and press return to search.

వెంకీ ఫార్ములా చిరూకి కూడా వ‌ర్క‌వుట్ అవుతుందా?

ఏ సినిమా అయినా స‌క్సెస్ అవాలంటే దానికి కంటెంట్ తో పాటూ క్వాలిటీ కూడా ముఖ్యం. క్వాలిటీ లేక ఎన్నో సినిమాలు స‌రైన ఆద‌ర‌ణ‌కు నోచుకోక‌పోవ‌డం చూశాం

By:  Sravani Lakshmi Srungarapu   |   3 Oct 2025 9:00 PM IST
వెంకీ ఫార్ములా చిరూకి కూడా వ‌ర్క‌వుట్ అవుతుందా?
X

ఏ సినిమా అయినా స‌క్సెస్ అవాలంటే దానికి కంటెంట్ తో పాటూ క్వాలిటీ కూడా ముఖ్యం. క్వాలిటీ లేక ఎన్నో సినిమాలు స‌రైన ఆద‌ర‌ణ‌కు నోచుకోక‌పోవ‌డం చూశాం. సినిమాలో మంచి కంటెంట్ ఉన్న‌ప్ప‌టికీ ఆ సినిమా స‌రైన క్వాలిటీలో తీయ‌క‌పోతే ఆడియ‌న్స్ దాన్ని చూడ‌టానికి ముందుకు రారు. అంతెందుకు ఎన్నో సినిమాలు క్వాలిటీ లేవ‌ని ఆడియ‌న్స్ తీవ్రంగా విమ‌ర్శిస్తూ ఉంటారు.

కానీ టాలీవుడ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి సినిమాలు మాత్రం దీనికి మినహాయింపుగా క‌నిపిస్తుంది. టాలీవుడ్ లో అప‌జ‌యం ఎరుగ‌ని డైరెక్ట‌ర్ గా అనిల్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ ఏడాది విక్ట‌రీ వెంకటేష్ తో క‌లిసి సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న అనిల్, ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవితో మ‌న శంక‌ర‌వ‌రప్ర‌సాద్ గారు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

మీసాల పిల్ల క్వాలిటీగా లేద‌ని కామెంట్స్

ఈ రెండు సినిమాల‌కీ ఓ సారూప్య‌త ఉంద‌ని సోష‌ల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. రీసెంట్ గా మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు మూవీ నుంచి మేక‌ర్స్ మీసాల పిల్ల ప్రోమోను రిలీజ్ చేయ‌గా, ఆ ప్రోమో క్వాలిటీగా లేద‌ని నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే గ‌తంలో సంక్రాంతికి వ‌స్తున్నాం సాంగ్స్ ప్రోమోల విష‌యంలో కూడా ఇదే కామెంట్ వినిపించింది.

సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమా విష‌యంలోనూ విమ‌ర్శ‌లు

కానీ తీరా సినిమా రిలీజ‌య్యాక చూస్తే సంక్రాంతికి వ‌స్తున్నాం రీజ‌న‌ల్ ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియ‌న్స్ ను ఎక్కువ‌గా టార్గెట్ చేసే అనిల్ రావిపూడి సినిమాలో క్వాలిటీ కంటే ఎక్కువ‌గా ఎంట‌ర్టైన్మెంట్ కు పెద్ద పీట వేయ‌డంతో రిలీజ‌య్యాక అంద‌రి ఫోక‌స్ వినోదం వైపుకు వెళ్తుందే త‌ప్పించి క్వాలిటీ వైపుకు వెళ్ల‌దు. అందుకే సంక్రాంతికి వ‌స్తున్నాం అంత భారీ హిట్ గా నిలిచింది. మ‌రి ఇప్పుడు చిరూ సినిమా కూడా సంక్రాంతికి వ‌స్తున్నాం లాగానే రికార్డులు సృష్టిస్తుందేమో చూడాలి. న‌య‌నతార హీరోయిన్ గా న‌టిస్తున్న మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు 2026 సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.