Begin typing your search above and press return to search.

అసలు సర్ ప్రైజ్ క్లారిటీ ఇచ్చిన రావిపూడి

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన లేటెస్ట్ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది.

By:  M Prashanth   |   22 Aug 2025 3:33 PM IST
అసలు సర్ ప్రైజ్ క్లారిటీ ఇచ్చిన రావిపూడి
X

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన లేటెస్ట్ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మెగా 157 సినిమా టైటిల్ అనౌన్స్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా మన శంకరవర ప్రసాద్ గారు అనే టైటిల్ తో రానున్నట్లు ప్రకటించారు. పండగకు వస్తున్నారు అనేది క్యాప్షన్. ఇందులో చిరు లుక్స్ వింటేజ్ చిరంజీవిని గుర్తు చేస్తున్నాయి.

ఆయన లుక్స్, యాటిట్యూడ్, స్టైల్ అన్ని అదిరిపోయాయి. అయితే గ్లింప్స్ లో అనిల్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు. మన శంకరవర ప్రసాద్ గారు, పండగకు వస్తున్నారు. అని విక్టరీ వెంకటేశ్ తో వాయిస్ ఓవర్ చెప్పించారు. ఇది వీడియోలో మరో హైలైట్ గా మారింది. అలాగే ప్రస్తుతానికి వాయిస్ ఓవరే ఇచ్చారు. అతి త్వరలో సినిమాలోనూ సందడి చేయనున్నారని చెప్పి అంచనాలు పెంచేశారు.

ఈ మేరకు గ్లింప్స్ లాంచ్ కార్యక్రమంలో రావిపూడి మాట్లాడుతూ చెప్పారు. అడగ్గానే వెంకటేశ్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు చాలా హ్యాపీగా వచ్చారు. మన శంకరవర ప్రసాద్ గారు, పండగకు వస్తున్నారు. అని వెంకటేశ్ గారే వాయిస్ ఇచ్చారు. ఆయనకు థాంక్స్. ప్రస్తుతానికి ఆయన వాయిస్ ఇచ్చారు. అతి త్వలోనే సినిమాలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు- విక్టరీ వెంకటేశ్ గారి కాంబో ఎలా ఉండబోతుందో, పండగకు చూస్తారు.

ఈసారి సర్ ప్రైజ్ ఉండబోతుంది. అది కూడా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి మీ ముందుకు తీసుకు వస్తాం. అని అనిల్ చెప్పారు. ఇక ఆయన చిరు- వెంకీ స్క్రీన్ పై సందడి చేయనున్నారని హింట్ ఇవ్వగానే ఫ్యాన్స్ కేరింతలతో చప్పట్లు కొట్టారు. అనిల్ ఒక్క స్టేట్ మెంట్ తో సినిమాపై అంచనాలు పెంచేశారని.. అసలు వెంకటేశ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

కాగా, మెగాస్టార్ ఇవాళ 70వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన సినిమా టైటిల్ గ్లింప్స్ వదిలారు. మరో విషయం ఏంటంటే.. ఆయన పెద్ద కుమార్తె సుస్మిత ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్ కూడా. నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరొలియో సంగీతం అందిస్తున్నారు. 2026 సంక్రాంతి పండగకు సినిమా రిలీజ్ కానుంది.