చిరు - రావిపూడి మూవీ.. అనుకున్నట్టు జరుగుతుందా?
అయితే ఇది రావిపూడికి కామనే. ఎందుకంటే ఎప్పుడూ మెరుపు వేగంతో సినిమాలను కంప్లీట్ చేస్తుంటారు.
By: M Prashanth | 17 Aug 2025 4:34 PM ISTటాలీవుడ్ సీనియర్ అండ్ స్టార్ హీరో చిరంజీవి లీడ్ రోల్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కొన్నాళ్ల క్రితం షూటింగ్ స్టార్ట్ అవ్వగా.. ఎప్పటిలానే అనిల్ రావిపూడి షూటింగ్ జెట్ స్పీడ్ లో నిర్వహిస్తున్నారు. రీసెంట్ గా ముచ్చటగా మూడో షెడ్యూల్ ను పూర్తి చేయడం విశేషం.
అయితే ఇది రావిపూడికి కామనే. ఎందుకంటే ఎప్పుడూ మెరుపు వేగంతో సినిమాలను కంప్లీట్ చేస్తుంటారు. సాధారణంగా ఆరు నుంచి ఏడు నెలల్లో గుమ్మడికాయ కొట్టేస్తారు. ఇప్పుడు చిరు మూవీ రెండు నెలల క్రితం స్టార్ట్ చేసినా.. అప్పుడే సగం షూటింగ్ ను పూర్తి చేశారు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.
ఆ విషయాన్ని పలుమార్లు ప్రస్తావించారు కూడా. కానీ ఇప్పుడు అనిల్ రావిపూడి అనుకున్నది చేస్తారా చేయరా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి సినిమా రిలీజ్ కు ఇంకా టైం ఉంది. కాబట్టి షూటింగ్ ను అనిల్ ఈజీగా పూర్తి చేయగలరు. కానీ మధ్యలో ఇప్పుడు టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మె అడ్డుపడింది.
30 శాతం వేతనాల పెంపు కోరుతూ కార్మికులు 14 రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయితే సమ్మె మొదలయ్యాక కొందరు నిర్మాతలు.. కొన్ని సినిమాల షూటింగ్స్ కోసం వేరే నగరాల నుంచి కార్మికులు రప్పించి కొనసాగించారని టాక్ వినిపించింది. కానీ ఆ తర్వాత ఛాంబర్.. చిత్రీకరణలు నిలిపివేయాలని ఆదేశించడంతో అన్నీ ఆగిపోయాయి.
ఆ నేపథ్యంలో చిరు- అనిల్ మూవీ షూటింగ్ కు కూడా తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీంతో సినిమా వాయిదా పడే అవకాశం ఉందని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ అనిల్ రావిపూడి.. మాత్రం తన టార్గెట్ ను అందుకునేలా ఇప్పటికే ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. గ్యాప్ కవర్ అయ్యేలా చూసుకుంటారట.
దానికి తోడు తాజాగా ఫిలిం ఛాంబర్ కూడా నాలుగు ప్రతిపాదనలను ఫిలిం ఫెడరేషన్ కు పంపింది. వాటికి ఓకే అయితే నిర్మాతలు వేతనాలు పెంచుతారని చెప్పింది. అదే సమయంలో చిరు కూడా నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులతో చర్చలు జరపనున్నారు. దీంతో సమ్మె కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే అనిల్ రావిపూడి అనుకున్నట్లే చిరు సినిమాను కంప్లీట్ చేసేలా ఉన్నారు.
