గ్లింప్స్: మన శంకర వర ప్రసాద్ గారు.. మెగా వింటేజ్ లుక్ అదిరింది!
టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి సినిమాలంటే మాస్ ఆడియన్స్‌కే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్‌కీ ఒక పండుగ వాతావరణమే.
By: M Prashanth | 22 Aug 2025 12:26 PM ISTటాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి సినిమాలంటే మాస్ ఆడియన్స్‌కే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్‌కీ ఒక పండుగ వాతావరణమే. ఆయన కమెడియన్ టైమింగ్, స్టైల్, మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ అందరికీ ప్రత్యేకంగా గుర్తుండిపోతాయి. ఇక ఇప్పుడు వింటేజ్ స్వాగ్‌ను తిరిగి చూడబోతున్నట్లు అర్ధమవుతుంది. బ్లాక్‌బస్టర్ ఎంటర్‌టైనర్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు అనిల్ రావిపూడి, మెగాస్టార్‌తో సినిమా చేస్తే ఎలా ఉంటుందో అనుకునే వారందరికీ ఇప్పుడు సమాధానం రాబోతోంది.
ఆయన దర్శకత్వంలో వస్తున్న కొత్త మాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే పెద్ద అంచనాలు నెలకొన్నాయి. ‘ఫన్, మాస్, ఫ్యామిలీ ఎమోషన్’ అన్నీ మిక్స్ అయి ఉండబోతున్నాయని టాక్. చిరంజీవి 70వ బర్త్‌డే స్పెషల్‌గా మేకర్స్ రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. సినిమాకు “మన శంకర వర ప్రసాద్ గారు” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. “పండగకి వస్తున్నారు” అనే ట్యాగ్‌లైన్ జోడించి పండగ మూడ్‌ను మరింత పెంచేశారు.
ఈ టైటిల్ చిరంజీవి అసలు పేరైన కోనిదెల శివ శంకర వర ప్రసాద్‌ను రీకాల్ చేస్తూ అభిమానుల్లో ఎమోషనల్ కనెక్ట్ కలిగిస్తోంది. గ్లింప్స్‌లో చిరంజీవి స్టైల్ గా నడుస్తూ, స్టైల్‌గా స్మోకింగ్ చేస్తూ, తన ప్రత్యేక వాకింగ్ స్టైల్‌తో మాస్ ఆడియన్స్‌ని ఫుల్‌గా ఎట్రాక్ట్ చేశారు. అనిల్ రావిపూడి చెప్పినట్టుగానే వింటేజ్ చిరు స్వాగ్‌ను తిరిగి చూపించారు. చిరంజీవి ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ గ్లింప్స్ హైలైట్‌గా నిలిచాయి.
ఈ టైటిల్ గ్లింప్స్‌కి మరో స్పెషల్ హైలైట్ వెంకటేష్ వాయిస్ ఓవర్. ఆయన చెప్పిన డైలాగ్స్ సినిమాకి కావాల్సిన ఫెస్టివ్ టోన్‌ని బలంగా సెట్ చేశాయి. అలాగే భీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విన్టేజ్ చిరు సాంగ్స్‌ను రీకాల్ చేస్తూ సూపర్‌గా ఎలివేట్ చేసింది. ఈ భారీ ఎంటర్‌టైనర్‌ని సాహు గరపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.
ఇక సినిమాను సంక్రాంతి 2026కి థియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మాస్, ఫన్, ఎమోషన్ కలిపిన పర్ఫెక్ట్ పండగ సినిమా రాబోతోందని టాక్. మొత్తం మీద “మన శంకర వర ప్రసాద్ గారు” టైటిల్ గ్లింప్స్ చిరంజీవి అభిమానులకు ఒక పెద్ద గిఫ్ట్‌గా మారింది. 70 ఏళ్ళ వయసులో కూడా ఆ స్టైల్‌లో చిరంజీవిని చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఈ గ్లింప్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
