Begin typing your search above and press return to search.

అనిల్ రావిపూడి.. ఆ రేంజ్ లో క్లిక్ అయ్యేనా?

టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఫ్లాప్ ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ హిట్లే.

By:  M Prashanth   |   27 Dec 2025 4:00 AM IST
అనిల్ రావిపూడి.. ఆ రేంజ్ లో క్లిక్ అయ్యేనా?
X

టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఫ్లాప్ ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ హిట్లే. ముఖ్యంగా దర్శకుడు అనిల్ రావిపూడి పేరు వినిపిస్తేనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్‌ గ్యారంటీ అన్న అభిప్రాయం ఇండస్ట్రీలో బలంగా ఉంది.

ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు అనిల్ రావిపూడి. విక్టరీ వెంకటేష్ హీరోగా ఫ్యామిలీ ఫార్ములాతో తెరకెక్కించిన ఆ సినిమా.. రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. 2025లో తెలుగులో బిగ్గెస్ట్ రీజనల్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ఎన్నో మూవీలు రిలీజ్ అయినా.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను డామినేట్ చేయలేదు.

కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథ, కామెడీ, ఎమోషన్స్, పండుగ వాతావరణం ఆ సినిమాకు ప్రధాన బలంగా మారాయి. సంక్రాంతి సీజన్‌ లో థియేటర్లకు కుటుంబాల్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఫార్ములా.. సంక్రాంతికి వస్తున్నాం మూవీ ద్వారా అనిల్ రావిపూడికి భారీ హిట్ తెచ్చిపెట్టింది.

ఇప్పుడు అదే విజయవంతమైన ఫార్ములాతో అనిల్ రావిపూడి.. మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం కూడా సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కాబోతోంది. జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

అయితే చిరంజీవి వంటి భారీ స్టార్‌ తో పాటు అనిల్ రావిపూడి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ టచ్ కలవడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుని.. హోప్స్ ను పెంచాయి. ముఖ్యంగా పూర్తి స్థాయి ఫ్యామిలీ ఆడియన్స్‌ ను టార్గెట్ చేస్తూ అనిల్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం.

సంక్రాంతి పండుగ వాతావరణం, కుటుంబ బంధాలు, కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్స్ తో పాటు మెగాస్టార్ స్టైల్ కు తగ్గట్టు సరైన ఎలివేషన్లు సినిమాలో ఉండనున్నాయని మన శంకర వరప్రసాద్ గారు చిత్రబృందం చెబుతోంది. దీంతో అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలదన్న నమ్మకం వ్యక్తమవుతోంది.

ముఖ్యంగా అనిల్ రావిపూడి తీసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సాధించిన స్థాయి విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈసారి కూడా అదే రేంజ్‌ లో మన శంకర వరప్రసాద్ సినిమా క్లిక్ అవుతుందా అన్న చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. మరి చిరంజీవి- రావిపూడి కాంబినేషన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.. సంక్రాంతికి వస్తున్నాం రేంజ్ లో మన శంకర వరప్రసాద్ గారు మూవీ క్లిక్ అవుతుందో లేదో చూడాలి.