Begin typing your search above and press return to search.

చిరు 'గ్యాంగ్ లీడర్' స్వాగ్.. సంక్రాంతికి రెండింతలు: అనిల్ రావిపూడి

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   22 Aug 2025 5:00 PM IST
చిరు గ్యాంగ్ లీడర్ స్వాగ్.. సంక్రాంతికి రెండింతలు: అనిల్ రావిపూడి
X

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కామెడీ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూపొందుతున్న ఆ మూవీ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే నేడు చిరు బర్త్ డే సందర్భంగా మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. టైటిల్ ను 'మన శంకర వరప్రసాద్ గారు' అని పెట్టినట్లు వెల్లడించారు. గ్లింప్స్ లో సిగరెట్ తాగుతూ సూట్ వేసుకుని చిరంజీవి యమా స్టైలిష్‌ గా కనిపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లింప్స్ వైరల్ అవుతుండగా.. అదిరిపోయిందని అంతా చెబుతున్నారు.

అదే సమయంలో గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ లో అనిల్ రావిపూడి మాట్లాడారు. చిరంజీవి గారి ఎన్నో సినిమాలు చూసి తాను పెరిగానని ఆయన తెలిపారు. ఆయన చిత్రాల్లో రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. మెగాస్టార్ కమ్ బ్యాక్ ఇచ్చిన తర్వాత అలాంటి స్వాగ్ మళ్లీ చూడాలని కోరిక ఉండేదని అన్నారు.

తనకు ఎప్పుడు అవకాశం వస్తుందోనని వెయిట్ చేసినట్లు తెలిపారు. ఇప్పుడు ఛాన్స్ వచ్చిందని చెప్పారు. చిరంజీవి గారిని మీరెలా చూడాలనుకుంటున్నారో సంక్రాంతికి దానికి రెండింతలు చూస్తారని తెలిపారు. అదే సమయంలో చిరంజీవి సూట్ లో చూడడం తనకు చాలా ఇష్టమని చెప్పిన అనిల్ రావిపూడి.. గ్లింప్స్ లో జస్ట్ శాంపిల్ మాత్రమేనని అన్నారు.

ఇంకా చాలా లుక్స్ ఉన్నాయని వెల్లడించారు. అయితే చిరంజీవి లుక్ కోసం ఎలాంటి వీఎఫ్ ఎక్స్ యూజ్ చేయలేదని.. 95 శాతం ఒరిజినల్ అని తెలిపారు. మూవీ కోసం మెగాస్టార్.. జిమ్ కు వెళ్లి సన్నబడ్డారని వెల్లడించారు. అయితే లుక్ విషయంలో ఎలాంటి ట్రోల్స్ రాకుండా ముందే క్లియర్ గా అనిల్ రావిపూడి చెప్పినట్లు స్పష్టంగా అర్థమవుతుంది.

కాగా.. మన శంకరవరప్రసాద్ గారు మూవీలో చిరు సరసన స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తున్నారు. సీనియర్ హీరో, విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మరి పొంగల్ కు రానున్న ఆ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.