Begin typing your search above and press return to search.

అనిల్ - చిరు టైటిల్ ఇదే.. మరో సర్ ప్రైజ్ కూడా..

మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తరువాత ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

By:  M Prashanth   |   21 Aug 2025 1:31 PM IST
అనిల్ - చిరు టైటిల్ ఇదే.. మరో సర్ ప్రైజ్ కూడా..
X

మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తరువాత ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రెగ్యులర్ యాక్షన్ జోన్ లో కంటే మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలో మెగాస్టార్ కనిపిస్తే చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అందుకు తగ్గట్లుగా ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. శైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహూ గారపాటి, చిరంజీవి కుమార్తె సుష్మిత కలిసి నిర్మిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ ను సంక్రాంతి 2026 రిలీజ్ కోసం సిద్ధం చేస్తున్నట్లు ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. గత కొంతకాలంగా ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూశారు. కారణం ఏమిటంటే చిరంజీవి మరో భారీ ప్రాజెక్ట్ విశ్వంభర షూట్ లో బిజీగా ఉండటం. ఇప్పుడు విశ్వంభరను 2026 సమ్మర్ లో రిలీజ్ చేయాలని ఫిక్స్ కావడంతో, సంక్రాంతి బరిలో అనిల్ రావిపూడి సినిమా దూసుకెళ్లేలా మారింది.

దీంతో చిరంజీవి బర్త్‌డే నుంచి వరుస అప్‌డేట్స్ వస్తాయని మేకర్స్ క్లియర్ చేశారు. ఇక టైటిల్ విషయానికొస్తే, అనిల్ రావిపూడి క్యాచీ టైటిల్స్ తో సినిమాలు చేయడంలో సిద్ధహస్తుడు. ఈసారి కూడా అదే కొనసాగిస్తూ, మెగాస్టార్ లెగసీకి దగ్గరగా ఉండే టైటిల్ ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమా పేరు 'మన శంకర వర ప్రసాద్ గారు' అని ఫిక్స్ చేశారట, ఇక ట్యాగ్‌లైన్ 'పండగకి వస్తున్నారు' అని సెట్ చేసినట్లు తెలుస్తోంది.

చిరంజీవి అసలు పేరు కొణిదెల శివ శంకర వర ప్రసాద్ కాబట్టి ఈ టైటిల్ ఫ్యాన్స్ కు మరింత కనెక్ట్ అయ్యేలా కలిగిస్తోంది. టైటిల్ రివీల్ ఈ ఆగస్టు 22న జరగనుంది. అదే రోజు చిరంజీవి 70వ పుట్టినరోజు కావడంతో, మెగా స్కేల్ లో అప్‌డేట్ ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా ఒక స్పెషల్ గ్లింప్స్ వీడియో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో సినిమాకి సంబంధించిన టోన్, ఫెస్టివ్ ఫీల్స్ ను చూపించేలా కట్ చేస్తున్నారు.

మరో ఆసక్తికరమైన సర్ప్రైజ్ కూడా గ్లింప్స్ లో ఉండనుందని టాక్ వినిపిస్తోంది. చిరంజీవికి సన్నిహితుడైన ఒక సీనియర్ స్టార్, టీజర్ లో వాయిస్ ఓవర్ ఇస్తారని వార్తలు వస్తున్నాయి. ఆయన ఎవరన్నది ఇంకా రహస్యంగానే ఉంచారు. ఫ్యాన్స్ మాత్రం నాగార్జున, బాలకృష్ణ ఇద్దరిలో ఎవరో ఒకరు చెప్పి ఉంటారు అనేలా కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఫ్యాన్స్ కి మరో కిక్ ఇచ్చేలా ఉంది. అనిల్ రావిపూడి స్టైల్ లో ఎంటర్‌టైన్‌మెంట్ తో పాటు ఫుల్ ఫ్యామిలీ ట్రీట్ గా ఈ సినిమా రూపొందుతోంది. చిరంజీవి బర్త్‌డే స్పెషల్ అప్‌డేట్ తో సినిమా చుట్టూ ఉన్న అంచనాలు రెట్టింపు కావడం ఖాయం.