మెగాస్టార్ ఆర్థిక సాయంపై నటుడు ఎమోషనల్
ఇది కేవలం కరోనా క్రైసిస్ లో మాత్రమే సాగే క్రతువు కాదు. మెగాస్టార్ నిరంతరం కష్టంలో ఉన్న పరిశ్రమ వ్యక్తులకు సహాయం చేస్తూనే ఉన్నారు.
By: Sivaji Kontham | 14 Aug 2025 3:52 PM ISTమెగాస్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ సమయంలో కష్టాల్లో ఉన్న చాలా మంది ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు సహా పరిశ్రమ కార్మిక కుటుంబాలను ఆదుకున్న సంగతి తెలిసిందే. ఆపదలో ఉన్న చాలా మందికి చెక్కు రూపేణా విరాళాలు అందించడానికి ఆయన వెనకాడలేదు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కష్టంలో ఉన్న చాలామంది మెగాభిమానులకు ఆర్థిక సాయం అందించారు.
ఇది కేవలం కరోనా క్రైసిస్ లో మాత్రమే సాగే క్రతువు కాదు. మెగాస్టార్ నిరంతరం కష్టంలో ఉన్న పరిశ్రమ వ్యక్తులకు సహాయం చేస్తూనే ఉన్నారు. తమిళ స్టంట్ మాస్టర్, ఆర్టిస్ట్ పొన్నంబలం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలైనప్పుడు అతడికి విరివిగా విరాళాలు అందించారు. తనకు చేసిన సహాయాన్ని విలన్ పొన్నంబళం అస్సలు మర్చిపోలేదు. వీలున్న ప్రతి వేదికపైనా మెగాస్టార్ తనకు చేసిన సహాయాన్ని ఆయన గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. తాను చిరు నుంచి కేవలం ఒక లక్ష విరాళం ఆశించానని, కానీ కోటి వరకూ ఆర్థిక సాయం చేసారని పొన్నంబళం వెల్లడించారు.
పొన్నంబళం కిడ్నీ సంబంధిత సమస్యకు చికిత్స చేయించుకుని ఇప్పుడు ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతున్నాడు. దానికి సహాయం అందించిన చిరును అతడు ఎప్పటికీ మరువడు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మెగాస్టార్ ని సంప్రదించగానే తనకు సహాయం అందిందని అతడు చెప్పాడు. పరిశ్రమలో ఎవరైనా చిరును ఆర్థిక సాయం కోరితే, ఆ వ్యక్తి నచ్చితే ఆయన ఏ స్థాయికైనా వెళతారని కూడా పొన్నంబళం వ్యాఖ్యానించారు. ఇతరులకు సహాయం చేసే విషయంలో చిరంజీవి ఎప్పుడూ ఉదారంగా ఉంటారని అన్నారు.
పొన్నంబళం ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో విలన్ గా నటించాడు. ఒకానొక సమయంలో చిరుతో ఘర్షణ పడ్డానని కూడా పొన్నంబళం చెప్పాడు. పాత విషయాలేవీ గుర్తు పెట్టుకోకుండా చిరు తనకు ఆర్థిక సాయం అందించారని కూడా గతంలో ఒక సందర్భంలో అతడు అన్నారు.
