Begin typing your search above and press return to search.

చరణ్ - చిరు ఎమోషనల్ మూమెంట్.. అక్కడ బర్త్ డే సెలబ్రేషన్స్!

ఈ సందర్భంగా మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ ఓ స్పెషల్ వీడియోని షేర్ చేసి తండ్రి చిరంజీవికి ఎమోషనల్ విషెస్ తెలిపారు.

By:  M Prashanth   |   22 Aug 2025 1:20 PM IST
చరణ్ - చిరు ఎమోషనల్ మూమెంట్.. అక్కడ బర్త్ డే సెలబ్రేషన్స్!
X

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈరోజు తన 70వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంటున్నారు. సాధారణంగా ప్రతి సంవత్సరం ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతుంటారు. అయితే ఈసారి మెగాస్టార్ ప్రత్యేకంగా తన కుటుంబ సభ్యులతో గోవా వెళ్లి బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీంతో ఈ వేడుక అక్కడే ఫ్యామిలీ అట్మాస్ఫియర్‌లో సాగుతోంది.

చిరంజీవి పుట్టిన రోజు సందర్భంలో ఆయనతో పాటు రామ్ చరణ్, ఉపాసన, సాయితేజ్‌తో సహా కుటుంబ సభ్యులు అందరూ కలిసి గోవాలో వేడుకలను జరుపుకుంటున్నారు. ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో కేక్ కటింగ్ జరుగగా, ఆ వేడుకల్లో హుషారుగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ సందర్భంగా మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ ఓ స్పెషల్ వీడియోని షేర్ చేసి తండ్రి చిరంజీవికి ఎమోషనల్ విషెస్ తెలిపారు. వీడియోలో చరణ్ మొదట కేక్ తినిపించి, చిరు కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ తర్వాత తండ్రి కొడుకులిద్దరూ హగ్ చేసుకుని ఆప్యాయ క్షణాన్ని పంచుకున్నారు. చిరంజీవి కూడా చరణ్‌కు కేక్ తినిపించడం ఆ వీడియోని మరింత క్యూట్ గా మార్చింది.

వీడియోతో పాటు రామ్ చరణ్ లవ్ ఇప్పుడు ఫ్యాన్స్‌ను ఫుల్ ఎమోషనల్ చేస్తోంది. “ఇది కేవలం మీ పుట్టినరోజు మాత్రమే కాదు నాన్న, ఇది మీలాంటి వ్యక్తికి ఒక అద్భుతమైన వేడుక. నా హీరో, నా గైడ్, నా ప్రేరణ మీరే. నేను సాధించిన ప్రతి విజయం, నేర్చుకున్న ప్రతి విలువ మీ నుండే వచ్చింది. 70 ఏళ్ల వయసులో కూడా మీరు హృదయంలో యవ్వనంగా, స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. మీ ఆరోగ్యం, ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండాలి” అని పేర్కొన్నారు.

చరణ్ ఈ స్పెషల్ వీడియో షేర్ చేయగానే అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగా ఫ్యాన్స్ ఆ వీడియోని షేర్ చేస్తూ తండ్రి కొడుకుల బంధాన్ని ఎమోషనల్‌గా సెలబ్రేట్ చేస్తున్నారు. #HBDMegastar70 హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇక సినిమాకు విషయానికి వస్తే నెక్స్ట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న మన శంకరవర ప్రసాద్ గారు.. అనే సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది. ఆ తరువాత సమ్మర్ కు విశ్వంభర రానుంది.