Begin typing your search above and press return to search.

విశ్వంభరకి దూరంగా మెగా ఫ్యాన్స్..?

ఐతే సంక్రాంతికి వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు మంచి హైప్ రాగా చిరంజీవి నుంచి నెక్స్ట్ వస్తున్న విశ్వంభర సినిమాకు మాత్రం ఎలాంటి బజ్ లేదు.

By:  Ramesh Boddu   |   5 Jan 2026 11:18 AM IST
విశ్వంభరకి దూరంగా మెగా ఫ్యాన్స్..?
X

మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో రాబోతున్నారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో పాటు మెగా బాస్ నుంచి ఫ్యాన్స్ ఆశించే మాస్ అంశాలు కూడా ఉంటాయని తెలుస్తుంది. మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఈ సంక్రాంతికి ఒక క్రేజీ సినిమాగా వస్తుంది. సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్ కూడా ఒక స్పెషల్ క్యామియో చేయడంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత బజ్ పెరిగింది.

ఐతే సంక్రాంతికి వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు మంచి హైప్ రాగా చిరంజీవి నుంచి నెక్స్ట్ వస్తున్న విశ్వంభర సినిమాకు మాత్రం ఎలాంటి బజ్ లేదు. వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అసలైతే లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సింది కానీ వి.ఎఫ్.ఎక్స్ వర్క్ పూర్తి అవ్వకపోవడంతో వాయిదాలు వేస్తూ వస్తున్నారు. ఐతే విశ్వంభర సినిమా మీద డైరెక్టర్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా..

విశ్వంభర సినిమాకు ఆడియన్స్ కాదు మెగా ఫ్యాన్స్ కూడా దూరంగా ఉన్నారు. సినిమా చందమామ కథలా ఉంటుందని వాళ్లు ఫిక్స్ అయ్యారు. ఐతే చిరు కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా చేశారు. ఆ సినిమా ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో వస్తున్న విశ్వంభర సినిమా మాత్రం ఆశించిన రేంజ్ హైప్ అందుకోవట్లేదు.

వశిష్ట మాత్రం సినిమాకు ఎంత లో బజ్ ఉన్నా థియేటర్ లో ఆడియన్స్ విజిల్స్ వేసేలా స్టోరీ, స్క్రీన్ ప్లే ఉంటుందని అంటున్నారు. సినిమా మీద ఎంత తక్కువ అంచనాలు ఉంటే అంత ప్లస్ అన్నది వాళ్ల ప్లాన్. ఐతే విశ్వంభర బజ్ మామూలుగానే ఉంది. సినిమా గురించి ఆడియన్స్ లో అంత ఆసక్తి లేదు. మరి రిలీజ్ టైం కు ప్రమోషన్స్ తో ఏమైనా బజ్ పెంచే ప్రయత్నం చేస్తారేమో చూడాలి.

మన శంకర వరప్రసాద్ ఎంటర్టైనింగ్ సినిమాగా..

యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఆషిక రంగనాథ్, మీనాక్షి చౌదరిలు కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. మన శంకర వర ప్రసాద్ గారు ఒక ఎంటర్టైనింగ్ సినిమాగా వస్తుండగా విశ్వంభర మాత్రం ఆడియన్స్ కి ఒక కొత్త విజువల్ ఎక్స్ పీరియన్స్ అందించడానికి వస్తుంది. మరి ఈ సినిమాపై మేకర్స్ పెడుతున్న ఎఫర్ట్స్ కి రిజల్ట్ కూడా అదే రేంజ్ లో ఉంటుందా లేదా అన్నది చూడాలి.

చిరంజీవి మాత్రం విశ్వంభర సినిమా మీద చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. ఐతే సినిమా రిలీజ్ విషయంలో జరుగుతున్న ఈ కన్ ఫ్యూజన్ ని త్వరలోనే క్లియర్ చేసి రిలీజ్ డేట్ ప్రకటించే ప్రయత్నాల్లో ఉన్నారు మేకర్స్. ఈ ఇయర్ మెగా ఫ్యాన్స్ కి చిరంజీవి నుంచి రెండు భారీ సినిమాలు వస్తున్నాయి. సంక్రాంతికి మన శంకర వర ప్రసాద్ గారు వస్తుండగా సమ్మర్ లో విశ్వంభర ట్రీట్ ఇవ్వనుంది.