తమ్ముడి దారిలో పెద్దన్నయ్య!
ఈ నేపథ్యంలో బాబి కూడా సీన్ లో కి వచ్చాడు. 158వ సినిమా తనదేనంటూ మెగాస్టార్ ని లాక్ చేసాడు. `వాల్తేరు వీరయ్య`తో చిరును డైరెక్ట్ చేసినా? ఆ సినిమా మాస్ హిట్ కావడంతో? చిరు బాబికే కమిట్ అయ్యారు.
By: Srikanth Kontham | 28 Sept 2025 9:00 AM ISTమెగాస్టార్ చిరంజీవి 70 ఏళ్ల వయసులోనూ సినిమాలు చేయడంలో స్పీడ్ ఎక్కడా తగ్గలేదు. 30 ఏళ్ల వయసున్న హీరో స్పీడ్ తోనే సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే 156వ చిత్రం `విశ్వంభర` షూటింగ్ పూర్తి చేసారు. ప్రస్తుతం 157వ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిది. ఈ చిత్రం కంటే ముందే `ది ప్యారడైజ్` దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతోనూ ఓ సినిమాకు కమిట్ అయ్యారు. ఇదే 157వ సినిమా అవ్వాలి. కానీ అనూహ్యంగా అనీల్ తెరపైకి రావడంతో శ్రీకాంత్ సినిమా నెంబర్ మారింది. ఇప్పుడా నెంబర్ పై సస్పెన్స్ కొనసాగుతుంది.
158 స్టోరీ లైన్ ఇదేనా:
ఈ నేపథ్యంలో బాబి కూడా సీన్ లో కి వచ్చాడు. 158వ సినిమా తనదేనంటూ మెగాస్టార్ ని లాక్ చేసాడు. `వాల్తేరు వీరయ్య`తో చిరును డైరెక్ట్ చేసినా? ఆ సినిమా మాస్ హిట్ కావడంతో? చిరు బాబికే కమిట్ అయ్యారు. ఆ సినిమా నెంబర్ 158గా తెలుస్తోంది. అయితే ఈసినిమా స్టోరీ లైన్ ఏంటి? అన్నది తాజాగా లీక్ అయింది. ఇది మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగే సీరియస్ యాక్షన్ థ్రిల్లర్ అని సమాచారం. బాబి మార్క్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా స్క్రిప్ట్ సిద్ద మైందంటున్నారు. అంటే వాల్తేరు వీరయ్యకు పూర్తి భిన్నమైన సినిమాగా తెలుస్తోంది.
మెగాస్టార్ డాన్ అవతారంలో:
వాల్తేరు వీరయ్యలో చిరుని మాస్ గా హైలైట్ చేస్తూనే ఆ పాత్రలో హాస్యాన్ని కూడా పండించారు. కానీ మాఫియా స్టోరీలో మాత్రం అలాంటి కామెడీ ట్రాక్ కి ఎంత మాత్రం అవకాశం ఇవ్వకుండా పక్కా ప్రోఫెషనల్ మాఫియా స్టోరీగా చూపించబోతున్నారుట. చిరంజీవి డాన్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. అన్యాయం ఎదురనైనా ప్రత చోటా డాన్ విజృంభణే హైలైట్ అవుతుందిట. బాబి ఆ పాత్రను రెగ్యులర్ డాన్ పాత్రలకు భిన్నంగా తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం చిరంజీవి అనీల్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
రాక్షసుడులా దసరా స్టార్ తో:
అన్ని పనులు పూర్తిచేసి సంక్రాంతి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అనంతరం బాబి సినిమా మొదలవుతుంది. ఈలోగా శ్రీకాంత్ ఓదెల నానితో తెరకెక్కిస్తోన్న `ప్యారడైజ్` కూడా ఓ కొలిక్కి వస్తుంది. అనంతరం ఆ సినిమా అప్ డేట్స్ కూడా చిరంజీవి రివీల్ చేసే అవకాశం ఉంటుంది. చిరుతో శ్రీకాంత్ చేసే సినిమా కూడా భారీ యాక్షన్ థ్రిల్లర్ అని..చిరు కల్ట్ హిట్ `రాక్షసుడు` లా ఉంటుందని ఇప్పటికే ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అన్నట్టు మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ రిలీజ్ `ఓజీ `కూడా మాఫియా సినిమా అన్న సంగతి విధితమే.
