మెగాస్టార్.. హార్డ్ వర్క్ కు తగ్గ రిజల్ట్ అందుకుంటారా?
సినీ ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించడం ఒక ఎత్తయితే.. దాన్ని కొన్నేళ్లుగా నిలబెట్టుకోవడం మరో ఎత్తు. ఆ రెండింటినీ సాధించిన నటుల్లో మెగాస్టార్ చిరంజీవి ముందువరుసలో ఉంటారు.
By: M Prashanth | 9 July 2026 4:03 PM ISTసినీ ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించడం ఒక ఎత్తయితే.. దాన్ని కొన్నేళ్లుగా నిలబెట్టుకోవడం మరో ఎత్తు. ఆ రెండింటినీ సాధించిన నటుల్లో మెగాస్టార్ చిరంజీవి ముందువరుసలో ఉంటారు. వయసు పెరుగుతున్నా.. పని విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడకుండా అదే డిసిప్లైన్, అదే డెడికేషన్ తో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న తన కొత్త సినిమా షూటింగ్ లో చిరంజీవి చూపిస్తున్న కమిట్మెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ కష్టానికి తగ్గ రిజల్ట్ మరోసారి బాక్సాఫీస్ వద్ద దక్కుతుందా అనే చర్చ మొదలైంది.
ప్రస్తుతం చిరు 158 హైదరాబాద్ లో కీలక షెడ్యూల్ జరుపుకుంటోంది. ఇందులో భాగంగా భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారు. ఆ ఫైట్ సీక్వెన్స్ కోసం చిరంజీవి డెడికేషన్ మూవీ టీమ్ ను ఆశ్చర్యానికి గురి చేసిందని టాక్ వినిపిస్తోంది. చిరంజీవి డైలీ వర్కౌట్స్ పూర్తి చేసి, ఆ తర్వాత షూటింగ్ కు సిద్ధమై ఉదయం నుంచి రాత్రి వరకు యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నారట. మధ్యలో కేవలం లంచ్ బ్రేక్ తప్ప.. మిగతా సమయమంతా సెట్స్ లోనే గడిపినట్లు తెలుస్తోంది.
ఆ యాక్షన్ సీన్స్ స్పెషాలిటీ ఏమిటంటే.. అవి వర్షంలో షూట్ చేస్తున్న విషయం. వర్షంలో ఫైట్ సీన్లు చేయడం ఏ నటుడికైనా ఫిజికల్ గా ఎంతో కష్టమైన పని. అలాంటి పరిస్థితుల్లో కూడా చిరంజీవి అదే జోష్ తో ప్రతి షాట్ ను పూర్తి చేశారని సమాచారం. ఎక్కడా అలసటకు అవకాశం ఇవ్వకుండా, ప్రతి మూమెంట్ ను పర్ఫెక్ట్ గా చేయడానికి ఆయన చూపిన డెడికేషన్ యూనిట్ ను ఆకట్టుకుందని టాక్ వినిపిస్తోంది.
ఆ ఫైట్ సీక్వెన్స్ ను ప్రముఖ స్టంట్ మాస్టర్స్ రామ్- లక్ష్మణ్ రూపొందిస్తున్నారు. సినిమా మొత్తంలోనే కాకుండా.. చిరంజీవి కెరీర్‌లో కూడా ఇది అత్యంత భారీ యాక్షన్ ఎపిసోడ్లలో ఒకటిగా నిలుస్తుందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా డూప్ ను ఎక్కువగా ఆశ్రయించకుండా స్వయంగా స్టంట్స్ చేయడానికి చిరంజీవి ఆసక్తి చూపుతున్నారని చర్చ సాగుతోంది.
చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ ఇప్పటికే వాల్తేరు వీరయ్య రూపంలో మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత మరోసారి ఇద్దరూ కలిసి పని చేస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. కమర్షియల్ అంశాలతో పాటు భారీ యాక్షన్, ఎమోషన్స్ కు ఇంపార్టెన్స్ ఇస్తూ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తోంది. సంగీతాన్ని తమన్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీని విజయ్ కార్తీక్ కన్నన్ నిర్వహిస్తున్నారు.
ఏదేమైనా ఒక నటుడి సక్సెస్ ను కేవలం స్టార్ ఇమేజ్ మాత్రమే నిర్ణయించదు. ఆ విజయానికి వెనుక ఉండే హార్డ్ వర్క్ కూడా అంతే ముఖ్యమైనది. చిరంజీవి ఇప్పటికీ అదే డెడికేషన్ తో వర్క్ చేస్తుండటం అభిమానుల్లో సినిమాపై మరింత నమ్మకాన్ని పెంచుతోంది. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ-చిరంజీవి కాంబో మరోసారి మ్యాజిక్ చేస్తుందా? మెగాస్టార్ హార్డ్ వర్క్ కు తగ్గ రిజల్ట్ బాక్సాఫీస్ వద్ద దక్కుతుందా? అన్నది వేచి చూడాలి.
