ఆంధ్రా కింగ్ 'చిన్ని గుండెలో'.. రామ్ ఎనర్జీకి మెలోడీ టచ్!
వివేక్ మెర్విన్ కంపోజ్ చేసిన ఈ మెలోడీ చాలా ప్లెజెంట్‌గా ఉంది. ముఖ్యంగా, రంగు రంగు తారలన్నీ.. అంటూ KK రాసిన లిరిక్స్ చాలా క్యాచీగా ఉన్నాయి.
By: M Prashanth | 31 Oct 2025 8:02 PM ISTది. సినిమా టైటిల్ చాలా మాస్‌గా ఉన్నా, ఈ "చిన్ని గుండెలో" పాట మాత్రం చాలా క్లాసీగా, లవ్లీ ఫీల్‌తో నిండిపోయింది. రామ్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ఈ సినిమాపై ఈ పాటతో అంచనాలు మరింత పెరిగాయి.
ఈ లిరికల్ వీడియోను చాలా క్రియేటివ్‌గా డిజైన్ చేశారు. "ఈ గాలి, ఆ హోరు, ఈ వెన్నెల.. నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా" అనే డైలాగ్‌తో పాట మొదలవుతుంది. "అలా సినిమాల్లోనే అవుతుంది" అని హీరోయిన్ అంటే, అయితే అక్కడికే వెళ్దాం.. అంటూ హీరో ఆమెను ఒక డ్రీమ్ వరల్డ్‌లోకి తీసుకెళ్లినట్లు చూపించారు.
వివేక్ మెర్విన్ కంపోజ్ చేసిన ఈ మెలోడీ చాలా ప్లెజెంట్‌గా ఉంది. ముఖ్యంగా, రంగు రంగు తారలన్నీ.. అంటూ KK రాసిన లిరిక్స్ చాలా క్యాచీగా ఉన్నాయి. మెర్విన్ సోలొమన్, సత్య యామిని వాయిస్‌లు పాటకు ప్రాణం పోశాయి. లిరికల్ వీడియోలో రామ్, భాగ్యశ్రీల కెమిస్ట్రీ అదిరిపోయింది. వైట్ అండ్ వైట్ డ్రెస్సుల్లో, మంచుతో కప్పిన డ్రీమ్ సెట్‌లో వాళ్ల స్టెప్పులు చాలా గ్రేస్‌ఫుల్‌గా ఉన్నాయి.
ఈ సాంగ్‌కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఎనర్జిటిక్ స్టెప్పులే కాదు, ఇలాంటి సాఫ్ట్ మెలోడీలను కూడా ఆయన ఎంత అందంగా కొరియోగ్రాఫ్ చేస్తారో ఈ పాట ప్రూవ్ చేసింది. ఇక వీడియో మధ్యలో చూపించిన సినిమా విజువల్స్ చూస్తుంటే, సినిమా ఏదో పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో, ఇసుక తిన్నెల దగ్గర నడిచే పీరియడ్ లవ్ స్టోరీలా అనిపిస్తోంది.
రామ్ హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్ కూడా చాలా కొత్తగా, రస్టిక్‌గా ఉన్నాయి. ఈ పాటతో సినిమాపై ఒక్కసారిగా క్లాస్ ఆడియెన్స్‌లో కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ లాంటి బడా సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాకు మహేష్ బాబు.పి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్ అనే ట్యాగ్ ఈ సినిమాకు చాలా కొత్తగా ఉంది. సినిమా నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇక సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర సూపర్ స్టార్ హీరోగా కనిపించబోతున్నాడు.
