Begin typing your search above and press return to search.

15 ఏళ్ళైనా పోరాడుతా..

ముఖ్యంగా ఆడవాళ్లకు, చిన్న పిల్లలకు ఏదైనా ఇబ్బందులు తలెత్తినట్లు తన దృష్టికి వస్తే మాత్రం సోషల్ మీడియాలో లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుందనటంలో సందేహం లేదు.

By:  Madhu Reddy   |   6 Nov 2025 10:54 AM IST
15 ఏళ్ళైనా పోరాడుతా..
X

సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ఎక్కువగా సెలబ్రిటీలను టార్గెట్ గా చేస్తూ వారి వ్యక్తిగత విషయాలను బయటకు తీస్తూ.. కొంతమంది నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ట్రోల్స్ ని కొంతమంది పట్టించుకుంటే.. మరి కొంత మంది చూసి చూడనట్టు వదిలేస్తారు.. ఇంకొంతమంది గట్టిగా కౌంటర్ ఇస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అలాంటి వారిలో ప్రముఖ సింగర్ చిన్మయి కూడా ఒకరు. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంది హీరోయిన్లకు గాత్రదానం చేసిన ఈమె సమాజంలో ఆడవాళ్లకు ఏదైనా సమస్య ఏర్పడితే తన గళం విప్పుతుంది.

ముఖ్యంగా ఆడవాళ్లకు, చిన్న పిల్లలకు ఏదైనా ఇబ్బందులు తలెత్తినట్లు తన దృష్టికి వస్తే మాత్రం సోషల్ మీడియాలో లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుందనటంలో సందేహం లేదు. అందుకే చాలాసార్లు ఆమె ట్రోలింగ్ ఎదుర్కొంటూ ఉంటుంది. అలా ట్రోలింగ్ వచ్చిన ప్రతిసారి కూడా వాటిని తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే అలాంటి చిన్మయి తాజాగా తన పిల్లల్ని ఇందులోకి లాగుతూ ట్రోలింగ్ చేయడంపై ఆమె తట్టుకోలేకపోయింది. దీంతో వీసీ సజ్జనార్ ను ఆశ్రయించింది. నిందితుడి పై కఠిన చర్యలు తీసుకోవాలని.. కేసు 15 సంవత్సరాలు నడిచినా తాను ధైర్యంగా ఎదుర్కొంటాను అంటూ చెప్పుకొచ్చింది. మరి అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఒకవైపు ఈమె భర్త రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉండగా.. మరొకవైపు కొంతమంది వ్యక్తులు ఆన్లైన్లో చాటింగ్ చేస్తూ చిన్మయిపై విరుచుకు పడడంతో ఆమె ట్రోలింగ్ ఎదుర్కొంటుంది. ముఖ్యంగా పలకలేని పదజాలంతో ఆమెను దూషిస్తూ అత్యంత దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉన్నా.. ఆమె పిల్లలను ఇందులోకి లాగడంతోనే అసలు సమస్య మొదలయ్యింది. దీంతో ఆవేదన వ్యక్తం చేసిన చిన్మయి.. వీసీ సజ్జనార్ తో తన బాధను చెప్పుకొచ్చింది.

చిన్మయి మాట్లాడుతూ.." ఒకప్పుడు నిజం మాట్లాడినందుకు తమిళనాడు ఇండస్ట్రీ నన్ను ఏడు సంవత్సరాలు బ్యాన్ చేసింది. అయితే అప్పుడు అందరూ నన్ను దూషించారే కానీ నా కడుపున పుట్టిన పిల్లలను ఏమాత్రం దూషించలేదు. కానీ తెలంగాణలో మాత్రం ఇలాంటి ఆడదానికి పిల్లలు పుడితే ఆ పిల్లలు చచ్చిపోవాలని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. దీనిని నేను ఎప్పటికీ మర్చిపోను. నా జీవితంలో అతడిని క్షమించను. ఇక్కడితో ఈ విషయాన్ని విడిచిపెట్టను" అంటూ సదరు వీడియోలను, కాంటాక్ట్లను హైదరాబాద్ వీసీ సజ్జనార్ కు ట్యాగ్ చేసింది. తాను చట్టబద్ధంగా పోరాడడానికి సిద్ధమని.. ఈ కేసు ఒక 15 సంవత్సరాలు నడిచినా తాను విడిచిపెట్టను అంటూ హెచ్చరించింది చిన్మయి.

ఇకపోతే సింగర్ చిన్మయి అభ్యర్థన మేరకు రాత్రికి రాత్రే సజ్జనార్ స్పందిస్తూ.. వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాదు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ సంబంధిత నిందితుడిని పట్టుకోవాలని తెలిపారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.