కక్ష గట్టి ఛాన్సులివ్వకుండా!
గాయని చిన్మయి మీటూ ఉద్యమంలో భాగంగా మీడియా ముందుకొచ్చి ఎంత సంచలనమైందో తెలిసిందే.
By: Srikanth Kontham | 6 Nov 2025 3:58 PM ISTగాయని చిన్మయి మీటూ ఉద్యమంలో భాగంగా మీడియా ముందుకొచ్చి ఎంత సంచలనమైందో తెలిసిందే. అవకాశాల పేరుతో మహిళల్ని చూసే విధానం, లైంగిక దాడి వంటి అంశాలపై మీడియా ముందుకొచ్చి గళమెత్తింది. వ్యక్తిగతంగా తనకెదురైనా అనుభవాలను పంచుకుంది. కోలీవుడ్ పరిశ్రమలో ఓ పెద్ద రచయిత తనతో వ్యవహరించిన తీరుపై ఎంతో ఓపెన్ గా మాట్లాడింది. అప్పట్లో ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపాయి. బాధితులంతా మీడియా ముందుకు రావాలని పిలుపునివ్వడంతో మరింత మంది బాధితులు ధైర్యంగా ముందు కొచ్చి తమకు జరిగిన అన్యాయంపై స్పందించారు.
అయితే చిన్మయి ఇలా తెగిండచంతో ఇండస్ట్రీలో చాలా అవకాశాలు కోల్పోయినట్లు తాజాగా ఆమె భర్త రాహుల్ రవీంద్ర తెలిపాడు. ఆయన దర్శకత్వం వహించిన `ది గర్ల్ ప్రెండ్` రిలీజ్ ప్రచారంలో భాగంగా ఈ విషయంపై స్పందించాడు. `డబ్బింగ్ ఆర్టిస్టుగా, సింగర్ గా చిన్మయి పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆమె తన వాయిస్ ను వినిపించిందన్నారు. `ఆమె స్పూర్తితోనే చాలా మంది మహిళలు బయటకు రాగలిగారు. అప్పటి వరకూ తమ బాధని పంటి కిందే దాచి పెట్టారు. కానీ చిన్మయి రావడంతో అంతా బయటకు వచ్చారు.
ఇలా చేయడం వల్ల చిన్మయికి వృత్తిగతంగా చాలా నష్టం జరిగింది. ఏడు సంవత్సరాలు పాటు, పని లేకుండా పోయింది. తమిళంలో డబ్బింగ్ చెప్పకుండా చేశారు. పాటలు పాడించుకోవడం మానేసారు. చిన్మయి మాత్రమే చెప్పాలి అని బలంగా ఉండే కొంత మంది దర్శక, నిర్మాతలు మినహా చాలా మంది ఛాన్సులివ్వలేదు. కక్షగట్టిన తీరును చూపించారు. అప్పుడే తెలుగులో ఎక్కువగా పాటలు పాడింది. మాలీవుడ్, శాండిల్ వుడ్ లో అవకాశాలు రావడంతో ఇబ్బంది లేకుండా పోయింది.
తనే కాదు చాలా మంది కెరీర్ ఇలాగే దెబ్బతింది. మరికొంత మంది కెరీర్ అయితే క్లోజ్ అయింది. చాలా మంది ఇప్పుడు కనిపించలేదన్నాడు. నటుడిగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా స్థిరపడిన సంగతి తెలిసిందే. `చిలసౌ`తో దర్శకుడిగా పరిచయమై తొలి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. అటుపై నాగార్జునతో `మన్మధుడు 2` తెరకెక్కించాడు. త్వరలో రిలీజ్ అవుతున్న `ది గర్ల్ ప్రెండ్` పై మంచి అంచనాలున్నాయి.
