Begin typing your search above and press return to search.

మళ్లీ ఇండస్ట్రీలో కలకలం.. మైనర్లపై వేధింపుల ఆరోపణలతో చిన్మయి హాట్ టాపిక్!

మూవీ ఇండ్రస్ట్రీ లో మహిళలపై, మైనర్లపై జరిగే వేధింపుల గురించి ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద ఎప్పుడూ ఓపెన్‌గా మాట్లాడుతుంటారు.

By:  Madhu Reddy   |   19 May 2026 3:10 PM IST
మళ్లీ ఇండస్ట్రీలో కలకలం.. మైనర్లపై వేధింపుల ఆరోపణలతో చిన్మయి హాట్ టాపిక్!
X

మూవీ ఇండ్రస్ట్రీ లో మహిళలపై, మైనర్లపై జరిగే వేధింపుల గురించి ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద ఎప్పుడూ ఓపెన్‌గా మాట్లాడుతుంటారు. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా పాత తరం నటులపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. సినిమాల పేరుతో గతంలో కొందరు సీనియర్ నటులు మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆమె చేసిన పోస్ట్‌లు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది. ఆ వివరాలు చూద్దాం.

రేఖ పాత సినిమా వివాదం:

గతంలో వచ్చిన ‘దో షికారి’ అనే హిందీ చిత్రంలో 15 ఏళ్ల వయసున్న నటి రేఖతో, 32 ఏళ్ల నటుడు బిస్వజిత్ ముద్దు సీన్ చేశారంటూ ఒక నెటిజన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఇక ఆ సమయంలో రేఖ ఇంకా మైనర్ కావడంతో, ఈ సీన్ వెనుక ఉన్న పరిస్థితులపై నెటిజన్లు రకరకాలుగా చర్చించుకోవడం మొదలుపెట్టారు.

రియాక్ట్ అయిన చిన్మయి:

ఈ ట్వీట్‌పై సింగర్ చిన్మయి స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాల పేరుతో, నటన పేరుతో కొందరు సీనియర్ నటులు మైనర్లపై ఇలాంటి లైంగిక వేధింపులకు పాల్పడటం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఇక ఈ రకమైన ఘటనలు చూస్తుంటే చాలా బాధగా, అసహ్యంగా అనిపిస్తోందని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

వినోద్ ఖన్నా, ఫెరోజ్ ఖాన్ ప్రస్తావన:

ఈ వివాదంలోకి చిన్మయి బాలీవుడ్ దిగ్గజ నటులు వినోద్ ఖన్నా, ఫెరోజ్ ఖాన్‌ల పేర్లను కూడా లాగారు. గతంలో వారిద్దరి గురించి వచ్చిన కొన్ని పాత ఆర్టికల్స్, కథనాలను తాను చదివానని.. అవి చదివినప్పుడు తాను తీవ్ర ఆశ్చర్యం కు గురయ్యానని చెప్పారు. ఇక ఇండస్ట్రీలో ఇలాంటి పద్ధతులు దారుణమంటూ ఆమె మండిపడ్డారు.

నెటిజన్ల కౌంటర్లు:

అయితే చిన్మయి చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కొందరు ఆమెకు సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు నెటిజన్లు మాత్రం ఆమెపై మండిపడుతున్నారు. ప్రస్తుతం లేని సీనియర్ నటుల గురించి, పూర్తి నిజాలు తెలియకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని, విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని ఆమెకు సలహా ఇస్తున్నారు.

సినీ ఇండస్ట్రీలో అప్పట్లో ‘మీటూ’ మూమెంట్‌తో పెద్ద సంచలనం సృష్టించిన చిన్మయి.. ఇప్పుడు మళ్లీ పాత తరం నటుల విషయాలను తెరపైకి తేవడం చర్చనీయాంశమైంది. మరి ఈ సరికొత్త వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో, దీనిపై పరిశ్రమకు చెందిన మిగతా వారు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.