ప్రియుడిని పెళ్లాడిన జేజమ్మ
అది మరెవరో కాదు, అనుష్క హీరోయిన్ గా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా అరుంధతిలో అనుష్క చిన్నప్పటి క్యారెక్టర్ లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ దివ్య నగేష్.
By: Sravani Lakshmi Srungarapu | 20 Aug 2025 1:03 PM ISTఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వాళ్లందరూ ఇప్పుడు చాలా పెద్దవాళ్లైపోయారు. అయితే పెద్దైన తర్వాత కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారితే మరికొందరు హీరోలు, హీరోయిన్లుగా మారారు. మరికొందరు సినిమాల్లో లేదా మోడలింగ్ లాంటి వృత్తుల్లో సెటిలైపోయారు. వారిలో కొందరికి పెళ్లిళ్లు కూడా అయ్యాయి. చైల్డ్ ఆర్టిస్టుగా నటించి పెళ్లి చేసుకున్న వారి లిస్టులోకి ఇప్పుడు మరొకరు జాయిన్ అయ్యారు.
జేజమ్మ పాత్రకు భారీ గుర్తింపు
అది మరెవరో కాదు, అనుష్క హీరోయిన్ గా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా అరుంధతిలో అనుష్క చిన్నప్పటి క్యారెక్టర్ లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ దివ్య నగేష్. ఆ సినిమాలో ఆమె నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. జేజమ్మ పాత్రలో ఒదిగిపోయి తన హావభావాలతో ఆడియన్స్ ను మెప్పించిన దివ్య ఆ తర్వాత పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు.
2025 మొదట్లో నిశ్చితార్థం
దివ్య పెద్దయ్యాక సినిమాలకు దూరంగానే ఉన్నారని చెప్పాలి. అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను మాత్రం షేర్ చేసుకుంటూనే వస్తున్నారు. ఈ ఏడాది మొదట్లో తాను నిశ్చితార్థం చేసుకున్న విషయాన్ని వెల్లడించిన దివ్య, రీసెంట్ గా పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఐదేళ్లుగా కొరియోగ్రాఫర్ తో ప్రేమలో..
గత ఐదేళ్లుగా ప్రముఖ కొరియోగ్రాఫర్ అజిత్ కుమార్ తో దివ్య నగేష్ లవ్ లో ఉన్నారు. ఐదేళ్ల ప్రేమ తర్వాత వీరిద్దరూ ఇటీవల ఆగస్ట్ 18న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే దివ్య తన పెళ్లి ఫోటోలను ఇంకా సోషల్ మీడియాలో షేర్ చేయలేదు కానీ తన ప్రీ వెడ్డింగ్ షూట్ కు సంబంధించిన ఫోటోలతో పాటూ, బ్యాచిలర్ పార్టీకి సంబంధించిన ఫోటోలను మాత్రం షేర్ చేశారు.
అనుష్క మాత్రం ఇంకా బ్యాచిలర్‌గానే
మొత్తానికి దివ్య నగేష్ పెళ్లి వార్త తెలుసుకున్న అభిమానులు ఆ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతుండగా, మరికొందరు మాత్రం అరుంధతిలో చిన్నప్పటి పాత్ర పోషించిన అమ్మాయి కూడా పెళ్లి చేసుకుంది కానీ అనుష్క మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదని, అనుష్క ఇంకెప్పుడు పెళ్లి కబురు చెప్తుందోనని కామెంట్స్ చేస్తున్నారు.
