Begin typing your search above and press return to search.

అన్వేష్ మనిషే కాదు.. నీతి లేని ఓ కుక్క: చికోటి ప్రవీణ్

సీతమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్ పై ఇప్పటికీ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

By:  M Prashanth   |   3 Jan 2026 4:25 PM IST
అన్వేష్ మనిషే కాదు.. నీతి లేని ఓ కుక్క: చికోటి ప్రవీణ్
X

సీతమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్ పై ఇప్పటికీ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దమ్ముంటే ఇండియాకు వచ్చి మాట్లాడాలని అంతా సవాల్ విసురుతున్నారు. ఇప్పుడు బీజేపీ నేత చికోటి ప్రవీణ్ కూడా అదే సవాల్ విసిరారు. అసలు అతను మనిషే కాదని ధ్వజమెత్తారు. Tupakiతో మాట్లాడుతూ అన్వేష్ పై తీవ్రంగా మండిపడ్డారు.

"వాడు ఒక మనిషే కాదు.. భూమికి భారం.. ఒక వెయ్యి మంది దొంగల చచ్చిపోతే అలాంటి ఒకడు పుడతాడు.. వాడి గురించి మాట్లాడడం వేస్ట్.. అనవసరంగా హైప్ చేస్తున్నారు.. దేశంపై విషాన్ని కక్కుతున్నాడు. ఆ విషయం క్లియర్ గా తెలుస్తోంది. హిందూ అని చెబుతున్నాడు.. కానీ విదేశాల్లో ఉండి బీఫ్ తింటున్నాడు.. అలాంటి ఒకడు హిందూ ఎలా అవుతాడు" అని ప్రశ్నించారు.

"మనమంతా నాగుపామును పూజిస్తాం.. నాగదేవత అంటూ కొలుస్తాం.. కానీ నాగుపామును తిన్నాడు అన్వేష్. చూడండి అతని వీడియోస్ ద్వారా తెలుస్తోంది. అడ్డగోలుగా వ్యభిచార గృహాలకు వెళ్ళాడు. అతడి గురించి మాట్లాడటం అవసరం లేదు. దమ్ముంటే.. మగాడు అయితే.. ఇండియాకు వచ్చి మాట్లాడు అన్వేష్" అంటూ ఛాలెంజ్ విసిరారు.

"ఎక్కడో దాక్కుని మాట్లాడుతున్నాడు.. దేశంపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నాడు. మరో దొంగ ఉన్నాడు.. బయట దేశంలో ఉండే హిందువులపై, బీజేపీపై విషం కక్కుతున్నాడు. అన్వేష్ కూడా అతని దారిలో ఉన్నాడు. తోపు అవుదామని అనుకుంటున్నాడు. ఇండియాకు వచ్చి పబ్లిక్ ప్లేస్ లో మాట్లాడు.. అప్పుడు ప్రజలేమనుకుంటున్నారో తెలుస్తుంది" అని అన్నారు.

"చెప్పులతో దాడి చేస్తారో.. గాడిదపై ఊరేగిస్తారో తెలుస్తుంది.. ఎక్కడో ఉండి మాట్లాడడం ఎందుకు? భారతదేశంలో ఉన్న స్వేచ్ఛ ఎక్కడా లేదు. ఎన్నో రకాల స్వేచ్ఛ ఉంది. అప్పుడప్పుడు అనుకోకుండా ఘటనలు జరుగుతాయి. కొందరు మూర్ఖుల వల్ల అవి అవుతున్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా అలాంటి ఘటనలు జరిగాయి" అని తెలిపారు.

"మన దేశంలో స్త్రీపై గౌరవం ఉంది. మన సనాతన ధర్మం అది నేర్పిస్తుంది. ఏ మతంలో అలా లేదు. స్త్రీ మూర్తిని కొలిచేది భారత్ లోనే.. అయోధ్యలో ఓ స్వామికి మహిళలు మొక్కితే వద్దన్నారు.. మహిళలు దేవతలూ ఉన్నారు.. వాళ్లతో మెక్కించుకోవద్దు అని చెప్పారు. అంత ధర్మం ఉన్న దేశంపై విషం కక్కుతున్నాడు" అంటూ మండిపడ్డారు.

"అన్వేష్ లాంటి వాడు బయట ఉండి చేసినా దేశానికి ఏం కాదు.. తట్టుకునే దమ్ము ఉంది.. నీలాంటి విష పురుగులు వస్తుంటారు పోతుంటారు.. త్వరలో ప్రజలు చెప్పులతో సన్మానం చేస్తారు. ఇండియాలో ఉండలేక పరాయి దేశంలో బతుకుతున్నాడు.. వాడి వల్ల దేశానికి హాని. హిందువులంతా బాయ్ కాట్ చేయాలి. నీతి లేని కుక్క వాడు" అంటూ ఫైర్ అయ్యారు.