చిరంజీవి కుటుంబం.. 35 ఏళ్లయినా చెరిగిపోని జ్ఞాపకాలు.. పెదనాన్నకు నివాళి!
కృష్ణమూర్తి గారు మరణించి నేటితో 35 ఏళ్లు గడిచాయి.ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన ధైర్యం, నైతిక విలువలు, కుటుంబంపై ఆయన చూపిన ప్రేమానురాగాలు ఎప్పటికీ చెరిగిపోనివి.
By: Madhu Reddy | 10 Oct 2026 4:51 PM ISTసమాజంలో నిజాయితీకి, నిబద్ధతకు నిలువెత్తు రూపంగా నిలిచి, ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన గొప్ప వ్యక్తి చిక్కాల కృష్ణమూర్తి గారు. విజయవాడలో పోలీస్ ఇన్స్పెక్టర్‌గా సేవలు అందించి, తన సుగుణాలతో ఎవరి మనసునైతే గెలుచుకున్నారో.. అదే మంచి మనసుతో ఆయన అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. సరిగ్గా 35 ఏళ్ల క్రితం (అక్టోబర్ 10, 1991న) ఆయన మనల్ని విడిచి వెళ్లినప్పటికీ, ఆయన అందించిన స్పూర్తి, జ్ఞాపకాలు మాత్రం కుటుంబ సభ్యులలో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి.ఆ వివరాలు చూద్దాం..
నిజాయితీకి మారుపేరుగా ఇన్స్పెక్టర్ గారు:
విజయవాడలో పోలీస్ ఇన్స్పెక్టర్‌గా పనిచేసిన చిక్కాల కృష్ణమూర్తి గారు తన వృత్తిని దైవంగా భావించారు. ఎక్కడా రాజీ పడకుండా అత్యంత నిజాయితీగా, సత్యసంధంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయనలోని సామాజిక సేవా తపన, తోటివారికి సహాయం చేయాలనే గుణం ఆయనను కేవలం ఒక అధికారిగానే కాకుండా, ప్రజల మనిషిగా నిలబెట్టాయి. అందుకే ఆయన ఉద్యోగ విరమణ చేసినా, ఆయన చేసిన మంచి పనులు విజయవాడ ప్రజల మదిలో ఇప్పటికీ అలాగే గుర్తుండిపోయాయి.
మెగాస్టార్ చిరంజీవికి అత్యంత ఇష్టమైన పెదనాన్న:
మెగాస్టార్ చిరంజీవి గారికి తన పెదనాన్న చిక్కాల కృష్ణమూర్తి గారంటే ఎంతో ఇష్టం, అపారమైన గౌరవం. కుటుంబంలో ఆయన చూపిన ప్రేమ, అనుబంధాలు చిరంజీవి గారి ఎదుగుదలలో ఎంతో ప్రభావం చూపాయి. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు మెహ్ర రమేష్ (భోళా శంకర్ చిత్రాల దర్శకుడు) కృష్ణమూర్తి గారి కుమారుడే కావడం విశేషం. ఇక వరసకు మెహర్ రమేష్ మెగాస్టార్ చిరంజీవికి కజిన్ అవుతారు. ఈ కుటుంబంతో చిరంజీవి గారికి ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైనది.
నేడు 35వ వర్ధంతి.. తీరని లోటు:
కృష్ణమూర్తి గారు మరణించి నేటితో 35 ఏళ్లు గడిచాయి.ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన ధైర్యం, నైతిక విలువలు, కుటుంబంపై ఆయన చూపిన ప్రేమానురాగాలు ఎప్పటికీ చెరిగిపోనివి. ఆయన వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఆ మహనీయుని జ్ఞాపకాలను మరోసారి నెరుగూర్చుకుంటూ ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.
సినిమాల పరంగా మెగాస్టార్ బిజీ షెడ్యూల్:
మరోవైపు, కుటుంబ సంస్కారాలను, విలువలను గౌరవిస్తూ ముందుకు సాగుతున్న మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారు. బాబీ దర్శకత్వంలో వస్తున్న గ్యాంగ్‌స్టర్ మాస్ యాక్షన్ డ్రామా 'కాకా' సంక్రాంతి కానుకగా 2027 జనవరి 13న విడుదల కానుంది. అలాగే వశిష్ట దర్శకత్వంలో భారీ సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర' పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉంది.
కాలం ఎంత వేగంగా మారుతున్నా, గొప్ప వ్యక్తులు మిగిల్చిన మంచి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ చెరిగిపోవు.చిక్కాల కృష్ణమూర్తి గారి నిజాయితీ, క్రమశిక్షణ అందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన 35వ వర్ధంతి సందర్భంగా ఆ పుణ్యమూర్తిని స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పిద్దాం.
