'చికిరి చికిరి'పై రమణ గోకుల ఇంట్రెస్టింగ్ కామెంట్!
తాజాగా రమణ గోకుల ఓ టాక్ షోలో ఈ జానర్లో సాంగ్ ను తాను కెరీర్ ఆరంభంలోనే చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఆ టైమ్ లో ఇడియమ్ చేసాను.
By: Srikanth Kontham | 12 Dec 2025 1:49 AM ISTరెహమాన్ సంగీతం అందించిన `పెద్ది`లో తొలి లిరికల్ `చికిరి చికిరి` సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. గత రికార్డులను అన్నింటిని `చికిరి చికిరి` తిరగరాసింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. ఈపాటకు డాన్స్ చేయని వారంటూ లేరు. అంతగా పాపులర్ అయిన పాట ఇది. చాలా కాలం తర్వాత రెహమాన్ మ్యాజిక్ ఇందులో కనిపించింది. తెలుగు ప్రేక్షకులంతా చాలా కాలానికి రెహమాన్ ని తలుచుకున్నారు. అయితే ట్యూన్ విషయంలో కాపీ అన్న ఆరోపణలు ఎదుర్కున్నారు. అయినా రెహమాన్ బ్రాండ్ ఇమేజ్, సాంగ్ సక్సెస్ తో నెగిటివిటీ పెద్దగా వెలుగులో రాలేదు.
తాజాగా రమణ గోకుల ఓ టాక్ షోలో ఈ జానర్లో సాంగ్ ను తాను కెరీర్ ఆరంభంలోనే చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఆ టైమ్ లో ఇడియమ్ చేసాను. కానీ దీని గురించి ఇప్పుడే చాలా మందికి తెలిసింది. చికిరి చికిరి తరహా సాంగ్ ఇండియమ్ తో అప్పట్లో తాను శ్రోతల్ని అలరించినపట్లు పేర్కొన్నారు. పక్కనే ఉన్న డైరెక్టర్ జయంత్ . సి పరాన్జీ కూడా రమణ గోగుల మాటకు మద్దతు పలికారు. రమణ గోకుల ఫాంలో ఉన్నంత కాలం ఎన్నో హిట్ సాంగ్స్ అందించారు. పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎక్కువగా ఈయనే సంగీతం అందించారు.
ఇద్దరి కాంబినేషన్ లో ఎన్నో సక్సెస్ పుల్ చిత్రాలున్నాయి. పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ రిలీజ్ `ఓజీ`కి కూడా ప్లే బ్యాక్ సింగర్ గా `లెట్స్ గో జానీ` అంటూ అభిమానుల్ని జానీ రోజుల్లోకి తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ బాగా అభిమా నించే మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇతడే. పలు వేదికలపై రమణ గోగుల సంగీతం తన సినిమాలకు ఎంతగా కలిసొచ్చింది అన్నది ఓపెన్ గానే చెప్పారు. రమణ గోగుల చివరిగా `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్` సినిమాకు సంగీతం అందించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత గోగుల మరే సినిమాకు సంగీతం అందించలేదు.
`ప్రేమంటే ఇదేరా` సినిమాతో అనుకోకుండా సంగీత దర్శకుడిగా రమణ ప్రయాణం మొదలైంది. సినిమాలంటే పెద్దగా ఆసక్తి లేని గోగులకు జయంత్. సి. పరాన్జీ అనుకోకుండా పరిచయమయ్యాడు. అప్పటికి అమెరికాలో ఆల్బమ్స్ చేసుకుంటూ బిజీగా ఉన్న గోగుల ముంబైకి రావడంతో సోనీ సంస్థలో ఇరువురు మీట్ అయ్యారు. ఆ సమయంలో జయంత్ అడగడం...గోగుల కొన్ని ట్యూన్స్ ఇవ్వడం వేగంగా జరిగిపోయాయి. అవి వెంకటేష్ కు బాగా నచ్చడంతో? అతడినే మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేసారు.
