చికిరి చికిరి.. అసలు మ్యాటర్ లీక్ చేసిన రైటర్!
ఈ పాట రాసిన లిరిసిస్ట్ బాలాజీ, ఈ లిరిక్స్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు.
By: M Prashanth | 13 Nov 2025 11:53 PM ISTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' (RC16) సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. దానికి ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ కూడా తోడవడంతో ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. రీసెంట్‌గా రిలీజైన "చికిరి చికిరి" సాంగ్, చరణ్ ఊరమాస్ డ్యాన్స్‌తో యూట్యూబ్‌ను ఒక ఊపు ఊపేస్తోంది. పాట గ్లోబల్‌గా ట్రెండ్ అవుతున్నా, అందులోని కొన్ని పదాలపై సోషల్ మీడియాలో చిన్నపాటి చర్చ మొదలైంది.
సాధారణంగా ప్రేమ పాటల్లో వినిపించే పదాలకు భిన్నంగా, ఈ పాటలో సరుకు సామాను, దీనక్క, లాంటి పూర్తి ఊర మాస్ నాటు పదాలు ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక స్టార్ హీరో సినిమాలో, రెహమాన్ లాంటి లెజెండ్ మ్యూజిక్‌లో ఇలాంటి లిరిక్స్ ఏంటని కొందరు కామెంట్స్ చేశారు. అయితే, ఈ పదాల వెనుక అసలు కథ వేరే ఉందనే విషయం ఇప్పుడు బయటపడింది.
ఈ పాట రాసిన లిరిసిస్ట్ బాలాజీ, ఈ లిరిక్స్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అందరూ అనుకుంటున్నట్లు ఇది రొటీన్ ప్రేమ పాట కాదని, దీని వెనుక డైరెక్టర్ బుచ్చిబాబు విజన్ వేరే ఉందని ఆయన క్లారిటీ ఇచ్చారు. "అందరూ అనుకుంటున్నట్లు 'చికిరి చికిరి' పాటలో ఉన్నది అసలైన ప్రేమ కాదు" అంటూ బాలాజీ అసలు మ్యాటర్ రివీల్ చేశారు.
డైరెక్టర్ బుచ్చిబాబు గారు బాలాజీకి ఇచ్చిన బ్రీఫ్ చాలా డిఫరెంట్‌గా ఉందట. "హీరో 'పెద్ది'కి, హీరోయిన్‌పై మొదట కలిగేది ప్రేమ కాదు, కేవలం ఓ కోరిక" అని బుచ్చిబాబు స్పష్టంగా చెప్పారట. 'పెద్ది' ఒక పల్లెటూరి వాతావరణంలో పెరిగిన రఫ్ అండ్ రస్టిక్ క్యారెక్టర్ కాబట్టి, అతని ఫీలింగ్స్ కూడా అంతే పచ్చిగా ఉంటాయని, అందుకే ఆ భావనను తెలియజేయడానికి నాటు లాంటి పదాలు వాడాల్సి వచ్చిందని బాలాజీ వివరించారు.
ఈ ఒక్క మాటతో సినిమాపై క్యూరియాసిటీ మరింత పెరిగింది. 'పెద్ది' పాత్ర ఎంత నిజాయితీగా, పచ్చిగా ఉండబోతుందో ఈ పాట లిరిక్స్‌తోనే డైరెక్టర్ ఒక హింట్ ఇచ్చేశారు. ఇక అలాంటి హీరో ప్రేమలోకి హీరోయిన్ ఎలా వెళుతుంది అనే క్యూరియసిటీ క్రియేట్ అవుతోంది. ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వీరితో పాటు కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. కేవలం కోరికతో మొదలైన ఈ జర్నీ, చివరికి ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇక సినిమా వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది. ఇక నెక్స్ట్ టీజర్ ట్రైలర్ బుచ్చిబాబు ఎలాంటి ట్విస్టులు ఇస్తారో చూడాలి.
