Begin typing your search above and press return to search.

వెకేషన్ మోడ్ లో రుహానీ శర్మ.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కి యూత్ ఫిదా!

సమ్మర్ వెకేషన్ అంటూ క్యాప్షన్ జోడిస్తూ.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

By:  Madhu Reddy   |   21 July 2026 11:41 AM IST
వెకేషన్ మోడ్ లో రుహానీ శర్మ.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కి యూత్ ఫిదా!
X

ప్రముఖ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతూ.. 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం చి ల సౌ. ఈ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించి.. మొదటి చూపులోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న రుహానీ శర్మ అందులో సాంప్రదాయంగా చుడీదార్ లలో కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. కాలం మారుతున్న కొద్దీ ట్రెండుకు తగ్గట్టుగా ఫ్యాషన్ ను ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు ఆడియన్స్ లో సరికొత్త క్యూరియాసిటీ పెంచేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా న్యూయార్క్ కి వెకేషన్ కి వెళ్ళిన ఈమె.. అందులో సమ్మర్ స్పెషల్ అంటూ తాజాగా షేర్ చేసిన ఫోటోస్ కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.





న్యూయార్క్ సిటీలో సందడి చేస్తున్న రుహానీ శర్మ..

సమ్మర్ వెకేషన్ అంటూ క్యాప్షన్ జోడిస్తూ.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా జుట్టును వేవ్ లా వదిలేసి.. తలపైన కళ్ళజోడు పెట్టి.. క్యూట్ గా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన ఈమె.. డెనిమ్ స్లీవ్ లెస్ జాకెట్ ధరించి, దీనికి కాంబినేషన్లో వైట్ లాంగ్ స్కర్ట్ తో తన మేకోవర్ ను ఫుల్ ఫిల్ చేసింది. మరొకవైపు సెల్ఫీ ఫోజులిస్తూ కుర్రకారు గుండెలను మాయ చేసింది. వెకేషన్ లో ఉన్న ఈమె న్యూయార్క్ సిటీ నుండి పంచుకున్న ఈ లేటెస్ట్ ఫోటోలు ,అక్కడి ప్రదేశాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.




మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న రుహాని శర్మ..

మొత్తానికి అయితే రుహానీ శర్మ సమ్మర్ వెకేషన్ లో భాగంగా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి. రుహానీ శర్మ 2017లో కడైసి బెంచ్ కార్తీ అనే చిత్రం ద్వారా తమిళ తెరకు పరిచయమైంది . నిత్య పాత్రతో తమిళ తంబీలను విపరీతంగా ఆకట్టుకున్న రుహానీ శర్మ.. ఆ తర్వాతే తెలుగు ఇండస్ట్రీలో తన నటనను కనబరిచింది. 2019లో కమల అనే మలయాళ చిత్రం ద్వారా అక్కడి ప్రేక్షకులను పలకరించిన రుహానీ శర్మ.. ఆ తర్వాత నుంచి తెలుగులోనే సినిమాలు చేస్తూ వచ్చింది.





రుహానీ శర్మ సినిమాలు..

అలా హిట్: మొదటి కేస్ లో తన నటనతో నేహా పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రుహానీ శర్మ.. డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు, హర్ : చాప్టర్ -1 , సైంధవ్, ఆపరేషన్ వాలెంటైన్, శ్రీరంగనీతులు, లవ్ మీ వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. హిందీలో అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈమె ప్రస్తుతం అల్లరి నరేష్ ఆల్కహాల్ చిత్రంలో నటిస్తోంది. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ సినిమాతో పాటు దుల్కర్ సల్మాన్ - శృతిహాసన్ కాంబినేషన్లో వస్తున్న బహు భాష యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ఆకాశంలో ఒక తార చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు గనక మంచి విజయం అందుకుంటే .. రుహానీ శర్మ కి టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.