Begin typing your search above and press return to search.

చెన్నై లవ్ స్టోరీ.. వీకెండ్ ర్యాంపేజ్ మామూలుగా లేదుగా!

ఇలాంటి సమయంలో ఆమె జీవితంలోకి వచ్చిన స్టీవెన్ శంకర్ ఎలా మార్పు తీసుకొచ్చాడు? చివరకు ఆమె జీవిత ప్రయాణం ఎటు దిశగా వెళ్లింది? అనే అంశాల చుట్టూ కథ తిరుగుతుంది.

By:  M Prashanth   |   26 July 2026 9:22 AM IST
చెన్నై లవ్ స్టోరీ.. వీకెండ్ ర్యాంపేజ్ మామూలుగా లేదుగా!
X

టాలీవుడ్‌ లో ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ప్రేమకథల లిస్ట్ లో చెన్నై లవ్ స్టోరీ మూవీ కూడా చేరిపోయేలా కనిపిస్తోంది. తొలి రోజు నుంచే మంచి టాక్‌ ను సొంతం చేసుకున్న ఆ సినిమా.. వీకెండ్‌ కు వచ్చేసరికి థియేటర్ల వద్ద సందడి పెంచుతోంది. ముఖ్యంగా వీకెండ్ నైట్ షోస్ పరిస్థితి చూస్తే.. ప్రేక్షకులు ఆ సినిమాను ఎంతగా ఆదరిస్తున్నారో అర్థమవుతోంది.

జులై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చెన్నై లవ్ స్టోరీ ఓ ప్యూర్ లవ్ స్టోరీ. రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఆ సినిమాకు రవి నంబూరి దర్శకత్వం వహించగా.. బేబీ ఫేమ్ సాయి రాజేష్ కథను అందించారు. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్.కే.ఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా నిర్మించారు. హీరోగా కిరణ్ అబ్బవరం, హీరోయిన్‌ గా శ్రీ గౌరీ ప్రియ నటించారు.

ప్రస్తుతం ఆ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తే.. కంటెంట్‌ కు ప్రేక్షకులు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మరోసారి స్పష్టమవుతోంది. వీకెండ్ నైట్ షోలలో హైదరాబాద్‌ లో 94 షోలలో 70 షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ లేదా సోల్డ్ అవుట్ దిశగా వెళ్లడం విశేషం. బెంగళూరులో 35 షోలలో 24, విశాఖపట్నంలో 19లో 14, తిరుపతిలో 5లో 4 షోలు హౌస్‌ ఫుల్‌ కు చేరువయ్యాయి. కర్నూలు, ఏలూరు, భీమవరం వంటి సిటీస్ లో దాదాపు అన్ని షోలు నిండిపోవడం గమనార్హం.

ట్రేడ్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారం.. ఆ చిత్రానికి ప్రధాన బలం మౌత్ టాక్. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడం, కుటుంబ ప్రేక్షకులు కూడా థియేటర్లకు రావడం కలిసి కలెక్షన్లకు ఊపునిస్తున్నాయి. ప్రతి గంటకు ఆక్యుపెన్సీ పెరుగుతుండటం కూడా అదే విషయాన్ని సూచిస్తోంది. సినిమా కథ విషయానికి వస్తే.. చెన్నై బ్యాక్ డ్రాప్ లో సాగే ఆ కథలో నివి అనే యువతి ప్రేమలో మోసపోయి తీవ్ర మానసిక క్షోభకు గురవుతుంది.

ఇలాంటి సమయంలో ఆమె జీవితంలోకి వచ్చిన స్టీవెన్ శంకర్ ఎలా మార్పు తీసుకొచ్చాడు? చివరకు ఆమె జీవిత ప్రయాణం ఎటు దిశగా వెళ్లింది? అనే అంశాల చుట్టూ కథ తిరుగుతుంది. భావోద్వేగాలకు పెద్దపీట వేయడంతో పాటు.. యువతకు దగ్గరయ్యే సీన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. నివి పాత్రలో శ్రీ గౌరీ ప్రియ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. మరోవైపు కిరణ్ అబ్బవరం కూడా తనకు అలవాటైన సహజమైన నటనతో ఆకట్టుకుంటున్నారని సినీ అభిమానులు చెబుతున్నారు.

మణిశర్మ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం కూడా సినిమాకు మరింత బలంగా నిలిచాయి. ఇక బాక్సాఫీస్ పరంగా చూస్తే.. కిరణ్ అబ్బవరం కెరీర్‌ లో ఇది మరో విజయంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మంచి ఓపెనింగ్స్ నమోదు చేసిన ఆ మూవీ.. వీకెండ్ ముగిసే సరికి మరింత స్ట్రాంగ్ వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ప్రజెంట్ అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే.. చెన్నై లవ్ స్టోరీ వీకెండ్‌ లో నిజంగానే ర్యాంపేజ్ సృష్టిస్తున్నట్టే కనిపిస్తోంది.