అక్కడ గాలిలోనే మ్యూజిక్: మణిశర్మ
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' మ్యూజికల్ ఫెస్ట్ తిరుపతిలో చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ ఈవెంట్ లో చాలా తక్కువగా, సింపుల్ గా మాట్లాడారు.
By: M Prashanth | 21 Jun 2026 10:29 AM ISTకిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' మ్యూజికల్ ఫెస్ట్ తిరుపతిలో చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ ఈవెంట్ లో చాలా తక్కువగా, సింపుల్ గా మాట్లాడారు. ఆయన తన స్పీచ్ లో చెన్నైతో తనకున్న అనుబంధాన్ని, ఈ సినిమా మ్యూజిక్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
ఇటీవల కాలంలో మణిశర్మ చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. మంచి కంటెంట్ ఉన్న డిఫరెంట్ సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. టాలీవుడ్ లోని దాదాపు స్టార్స్ అందరితో వర్క్ చేసిన అనుభవం ఉంది. ఇక చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా మంచి మెలోడీస్ ఇవ్వడంలో ఆయన స్టైలే వేరు. ఇక ఇప్పుడు కిరణ్ అబ్బవరం సినిమాకు మ్యూజిక్ ఇవ్వడం మరో హైలెట్. ఈవెంట్ లో ఆయన మాట్లాడిన విధానం అందరిని ఆకట్టుకుంది.
ముందుగా ఆయన మాట్లాడుతూ.. చెన్నై అంటే తనకు చాలా ఇష్టమని, తాను చెన్నైలోనే పుట్టి పెరిగానని చెప్పారు. అక్కడే మ్యూజిక్ నేర్చుకున్నానని, అక్కడే స్టూడియో కట్టానని, అక్కడే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగానని తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. చెన్నై అనే పేరుతో తనకు చాలా దగ్గరి సంబంధం ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అయితే, చెన్నైలో గాలిలోనే మ్యూజిక్ ఉంటుందని ఆయన ఆసక్తికరమైన కామెంట్ చేశారు. అది తను స్వయంగా అనుభవించానని ఆయన చెప్పారు. అలాంటి ఒక అద్భుతమైన మ్యూజిక్ ను ఈ సినిమాలో వింటారని ఆయన నమ్మకంగా చెప్పారు.
తన గురువు గారు ఇళయరాజా గారి గురించి మాట్లాడుతూ.. ఆయన కూడా చెన్నైలోనే తన సంగీత ప్రయాణాన్ని సాగించారని, ఆయనొక అద్భుతమని మణిశర్మ కితాబిచ్చారు. 'చెన్నై లవ్ స్టోరీ' అంటే చెన్నైలాగే అద్భుతమైన ఒక బ్రీజ్ లాంటి మంచి పాటలను రవి నంబూరి, సాయి రాజేష్ దగ్గరుండి చేయించుకున్నారని ఆయన అన్నారు. ఈ సినిమాలోని పాటలు చాలా బాగా వచ్చాయని, అవి ప్రేక్షకులకు నచ్చుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ సినిమాలో ఎస్కేఎన్, కిరణ్, సాయి రాజేష్ అందరూ చాలా అద్భుతంగా పని చేశారని, సినిమా చాలా సక్సెస్ సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాలోని ఒక పాటను తన ముందు తిరుపతిలో రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఏడుకొండల వాడి పాదాల దగ్గర అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఆయన తన స్పీచ్ ను ముగించారు.
