చెన్నై లవ్ స్టోరీ 3 రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్.. లెక్క ఏ స్థాయిలో ఉందంటే..
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చెన్నై లవ్ స్టోరీ సినిమా థియేటర్లలో తన ఫస్ట్ వీకెండ్ ను సక్సెస్ ఫుల్ గా ముగించుకుంది.
By: M Prashanth | 27 July 2026 2:54 PM ISTకిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చెన్నై లవ్ స్టోరీ సినిమా థియేటర్లలో తన ఫస్ట్ వీకెండ్ ను సక్సెస్ ఫుల్ గా ముగించుకుంది. మొదటి రోజు నుంచి వస్తున్న టాక్ తో ఈ మూవీకి వసూళ్లు ఓకే లెవెల్ లో వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ గా ఈ చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్ గా ఒక పోస్టర్ ని రిలీజ్ చేస్తూ సినిమా కలెక్షన్లపై క్లారీటీ ఇచ్చింది. మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రకారం, ఈ సినిమా మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.40.1 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది.
సినిమా రిలీజైన తొలి వీకెండ్ లో ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ వల్లే ఈ రేంజ్ నంబర్స్ వచ్చాయని నిర్మాతలు ఆ పోస్టర్ లో చెప్పారు. ముఖ్యంగా సోషల్ మీడియా డిస్కషన్లు, నెటిజన్లు ఇచ్చిన రివ్యూలు ఈ లవ్ డ్రామాకు కలెక్షన్ల పరంగా కాస్త హెల్ప్ అయినట్లు కనిపిస్తోంది. మొదటి రోజు కంటే తర్వాతి రెండు రోజుల్లో బుకింగ్స్ మెరుగవ్వడం బాక్సాఫీస్ దగ్గర ఈ ప్రాజెక్ట్ కి బాగా కలసి వచ్చింది. కంటెంట్ లో ఉన్న ఎమోషన్ కు యూత్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఎమోషనల్ కనెక్ట్ ఉన్న ప్రేమకథ కావడంతో కుర్రకారు థియేటర్ల వైపు ఎక్కువగా వస్తున్నట్లు సమాచారం. నటీనటులు కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ మధ్య వచ్చే సీన్స్ చాలా న్యాచురల్ గా ఉండటం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడంతో ఫస్ట్ వీకెండ్ మంచి ఆక్యుపెన్సీ నమోదైనట్లు తెలుస్తోంది. దీనికితోడు రేస్ లో వేరే పెద్ద సినిమాలు ఏవీ పోటీలో లేకపోవడం కూడా ఈ మూవీ వీకెండ్ కలెక్షన్లు పెరగడానికి ఒక ప్లస్ పాయింట్ గా మారింది.
అయితే మీడియం బడ్జెట్ తో వచ్చే సినిమాలకు మొదటి మూడు రోజుల్లో ఈ స్థాయిలో నంబర్స్ రావడం మంచి రిజల్ట్ కిందకే వస్తుంది. నిర్మాతలు అనౌన్స్ చేసిన ఈ రూ.40.1 కోట్ల మార్క్ చూస్తుంటే సినిమా ప్రాఫిట్స్ వైపు వేగంగా వెళ్తున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే అసలైన టెస్ట్ ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక సోమవారం థియేటర్లలో జనాలు ఎంతవరకు వస్తారనే దానిపైనే ఈ మూవీ ఫుల్ రన్ కలెక్షన్లు డిపెండ్ అయి ఉంటాయి.
ఇప్పటివరకు వచ్చిన పబ్లిక్ టాక్ తో వీకెండ్ ను సేఫ్ గా ముగించిన ఈ సినిమా, వీక్ డేస్ లో కూడా కలెక్షన్లను ఇదే స్థాయిలో హోల్డ్ చేయగలిగితే బాక్సాఫీస్ దగ్గర మంచి రిజల్ట్ సాధించే ఛాన్స్ ఉంది. ప్రమోషన్స్ విషయంలో కూడా మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను ఆడియన్స్ ముందుకు తెచ్చిన విధానం మెచ్చుకోదగ్గది. సినిమాలోని ప్రతి క్యారెక్టర్ కు ఆడియన్స్ నుంచి మంచి అప్రిషియేషన్ దక్కుతోందని ఇండస్ట్రీలో డిస్కషన్ నడుస్తోంది.
డైరెక్టర్ రవి నంబూరి టేకింగ్, ప్రొడ్యూసర్లు ఎస్కేఎన్, సాయి రాజేష్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ ప్రాజెక్ట్ కు అవసరమైన క్వాలిటీని ఇచ్చాయని నెటిజన్లు అనుకుంటున్నారు. కథలోని ఎమోషనల్ పాయింట్ వర్కౌట్ అవ్వడం వల్ల ఈ వీకెండ్ బాక్సాఫీస్ దగ్గర సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయినట్లే అనిపిస్తోంది. రాబోయే రోజుల్లో హోల్డ్ ఎలా ఉంటుందో, వీక్ డేస్ లో ఈ కలెక్షన్స్ ఏ రేంజ్ కి వెళ్తాయో చూడాలి.
