Begin typing your search above and press return to search.

కిరణ్ అబ్బావరం.. 50 కోట్ల మార్క్

ఏదైనా ఒక సినిమా వీకెండ్ లో మంచి కలెక్షన్లు సాధించడం సహజమే కానీ వర్కింగ్ డే అయిన సోమవారం రోజున కూడా థియేటర్లలో జనాలు ఉంటేనే అసలైన సక్సెస్ అని చెప్పవచ్చు.

By:  M Prashanth   |   1 Aug 2026 12:51 PM IST
కిరణ్ అబ్బావరం.. 50 కోట్ల మార్క్
X

ఏదైనా ఒక సినిమా వీకెండ్ లో మంచి కలెక్షన్లు సాధించడం సహజమే కానీ వర్కింగ్ డే అయిన సోమవారం రోజున కూడా థియేటర్లలో జనాలు ఉంటేనే అసలైన సక్సెస్ అని చెప్పవచ్చు. రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రం సోమవారం టెస్ట్ ను పాజిటివ్ గానే దాటేసింది. బిగ్ స్క్రీన్స్ దగ్గర ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ తో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూట్ క్లియర్ చేసుకుంది. దాంతో గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా 50 కోట్ల గ్రాస్ క్లబ్ లో అడుగుపెట్టింది.





ప్రస్తుతం బాక్సాఫీస్ రేసు ఏమీ ఖాళీగా లేదు. ఒకవైపు 'జననాయగన్' లాంటి పెద్ద సినిమాలు, ఇంకోవైపు 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' లాంటి హాలీవుడ్ హంగామా నడుస్తోంది. ఇంతటి భారీ కాంపిటీషన్ ఉన్నప్పటికీ ఈ లవ్ స్టోరీ తన సపరేట్ మార్కెట్ ని క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లు, మేజర్ సెంటర్లలో ఇప్పటికీ బెటర్ ఆక్యుపెన్సీతో రన్ అవుతుండటం విశేషం.

గతంలో వచ్చి బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన 'బేబీ' సినిమా జర్నీకి, ఈ చిత్రం వెళ్తున్న రూట్ కి ట్రేడ్ వర్గాలు పోలికలు తీస్తున్నాయి. మొదటి రెండు రోజులు కేవలం టాక్ తో స్టార్ట్ అయినప్పటికీ, ఆ తర్వాత ఫ్యామిలీస్, యూత్ రికమండేషన్స్ తో థియేటర్ల దగ్గర రష్ పెరిగింది. ఆర్గానిక్ వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల ఈ సినిమాకు లాంగ్ రన్ దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ సినిమాలో హీరోగా నటించిన కిరణ్ అబ్బావరం కెరీర్ లోనే ఇది ఒక కీలకమైన ప్రాజెక్ట్ గా నిలిచింది. రొటీన్ మాస్ ఎలిమెంట్స్ జోలికి వెళ్లకుండా ఎమోషనల్ యాక్టింగ్ కి ఎక్కువ స్కోప్ ఉన్న పాత్రను ఎంచుకోవడం ఆయనకు వర్కౌట్ అయింది. ఇక హీరోయిన్ శ్రీ గౌరి ప్రియా కూడా తన నాచురల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో సీన్స్ ని బాగా ఎలివేట్ చేసింది. ఇద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ సీన్స్ డ్రామాకు మంచి ప్లస్ అయ్యాయి.

కథను అనవసరమైన డ్రామా లేకుండా చాలా పద్ధతిగా ప్రెజెంట్ చేసిన డైరెక్టర్ రవి నంబూరి మేకింగ్ పై పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అలాగే సాయి రాజేష్ అందించిన రైటింగ్, క్యారెక్టర్ డిజైనింగ్ నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. కంటెంట్ లో జనాలకు కనెక్ట్ అయ్యే ఎమోషన్ ఉంటే ఖచ్చితంగా ఆదరిస్తారని ఈ ప్రాజెక్ట్ మరోసారి ప్రూవ్ చేసింది. మాస్ మూవీ మేకర్స్, అమృతా ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్ కే ఎన్, సాయి రాజేష్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాతో కిరణ్ అబ్బావరం కెరీర్ లోనే హైయెస్ట్ గ్రోసింగ్ ఫిగర్స్ నమోదయ్యాయి.