డబ్బులెగ్గొట్టారు..ఇల్లు సొంతం చేసుకున్నారు!
వెండి తెర గయ్యాళి ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సూర్యకాంతం. అటుపై అంతటి ఖ్యాతికెక్కిన నటి ఛాయాదేవి.
By: Srikanth Kontham | 20 Aug 2025 3:45 PM ISTవెండి తెర గయ్యాళి ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సూర్యకాంతం. అటుపై అంతటి ఖ్యాతికెక్కిన నటి ఛాయాదేవి. ఇద్దరి కాంబినేషన్లో సన్నివేశాలంటే ఓ రేంజ్ లో రక్తి కట్టేవి. అప్పటి జనరేషన్ ఆడియన్స్ ని ఎంతగానే అలరించేవి. అత్త పాత్రైనా...పక్కింటోళ్లతో గొడవ పాత్రైనా? ఛాయాదేవి, సూర్యకాంతం ఉండాల్సిందే అనే వారు నాటి మేకర్స్. వాళ్ల కోసమే గయ్యాళి పాత్రలు సృష్టించిన దర్శకులెంతో మంది.
హీరోలకు దీటుగా వెండి తెరపై ఆ ద్వయంలో సన్నివేశాలు అద్భుతంగా పండేవి. తాజాగా ఛాయాదేవి కుటుంబ నేపథ్యం గురించి సీనియర్ దర్శకులు నందం హరిశ్చంద్ర కొన్ని విషయాలు పంచుకున్నారు. 'ఛాయా దేవి పేద కుటుంబంలో పుట్టారు. కుటుంబంలో నిత్యం గొడవలుండేవి. దీంతో ఛాయాదేవి నాటకాలపై దృష్టి మళ్లించారంన్నారు. నిర్మలమ్మతో కలిసి ఛాయాదేవి నాటకాలు వేసేవారు. కొన్నాళ్లకు నిర్మలమ్మకు సినిమాల్లో ఛాన్సులు రావడంతో? మద్రాస్ వెళ్లిపోయారన్నారు.
దీంతో ఛాయాదేవి కూడా కొన్ని రోజులకే మద్రాస్ చేరుకున్నారు. నాటక రంగం అనుభవంతో సినిమాల్లో అవకాశాలు దక్కేవి అప్పట్లో. ఛాయాదేవి చిన్న చిన్న అవకాశాలతో కెరీర్ ప్రారంభించి నటిగా ఎదిగారు దాదాపు 300లకు పైగా సినిమాలు చేసారు. నటిగా ఆమెకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడింది. కానీ ఛాయాదేవి వివాహానికి దూరంగా ఉన్నారు. జీవితాంతం సింగిల్ గానే ఉన్నారు. దీంతో ఆమెకు కుటుంబ జీవితం లేకుండా పోయిందన్నారు. ఛాయాదేవి సంపాదించిన డబ్బుతనే సొంతంగా ఇల్లు నిర్మిం చుకున్నారు.
దాచుకున్న డబ్బును వడ్డీలకు ఇచ్చేవారు. నటిగా సంపాదన వడ్డీ మీద వచ్చే ఆదాయంతో బాగానే కూడ బెట్టారు. కానీ ఛాయాదేవి ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు. దీంతో అనారోగ్యానికి గురయ్యారు. అదే అదునుగా వడ్డీలు తీసుకున్న వాళ్లు డబ్బులు ఎగ్గొట్టారు. ఇంట్లో అద్దెకు ఉన్నవారు ఇల్లును తమ సొంత ఇల్లుగా మార్చుకున్నారు. ఆ సమయంలో ఛాయాదేవికి ఎవరూ సహకరించలేదు. అనేక ఇబ్బందులతో ఛాయాదేవి కన్ను మూసారని తెలిపారు.
