టాలీవుడ్ లో శివరంజని `ఊహ`గా అలా!
ఛార్మింగ్ స్టార్ శ్రీకాంత్ సతీమణి ఊహ పరిచయం అసవరం లేని పేరు. శ్రీకాంత్ తో వివాహం అనంతరం ఊహ సినిమాలకు దూరమయ్యారు.
By: Srikanth Kontham | 9 Sept 2025 7:00 PM ISTఛార్మింగ్ స్టార్ శ్రీకాంత్ సతీమణి ఊహ పరిచయం అసవరం లేని పేరు. శ్రీకాంత్ తో వివాహం అనంతరం ఊహ సినిమాలకు దూరమయ్యారు. భర్త, పిల్లలు, కుటుంబం అంటూ ఇంటికే పరిమితయ్యారు. సినిమాల్లో సెకెండ్ ఇన్నింగ్స్ రూపంలో అవకాశాలు వచ్చినా? ఆ ఛాన్స్ తీసుకోలేదు. కాలక్రమంలో సినిమాలంటే అనాసక్తి వ్యక్తం చేసారు. అలా ఊహ వెండి తెర నుంచి నిష్క్రమించారు. మీడియాలో కూడా పెద్దగా కనిపిం చరు. శ్రీకాంత్ హీరోగా కొనసాగిన సమయంలో కూడా పెద్దగా సినిమా ఈవెంట్లకు వచ్చే వారు కాదు.
దర్శకుడు చొరవతో:
అలా మీడియాకు కూడా ఊహ దూరమయ్యారు. అప్పుడప్పుడు స్పెషల్ ఇంటర్వ్యూల్లో తప్ప సోషల్ మీడియాలో మాత్రం అస్సలు కనిపించరు. తొలి నుంచి ఆమె సామాజిక మాధ్యమాలకు దూరంగానే ఉన్నారు. ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నారు. అయితే తాజాగా ఆమె పేరుకు సంబంధించి ఓ ఇంట్రె స్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె అసలు పేరు ఊహకాదు. శివరంజని అని తెలిసింది. కానీ ఇండస్ట్రీలో అప్పటికే ఓ శివ రంజని ఉండటంతో? దర్శకుడు ఈ.వి.వి సత్యనారాయణ శివరంజనీగా ఎందుకని భావించి `ఊహ`గా పేరు మార్చారుట.
రీల్ సీన్ రియల్ లైఫ్ లో
తాజాగా ఓ ఇంటర్వ్యూలోనే ఈ విషయాన్ని ఊహ రివీల్ చేసారు. అలాగే 'ఆమె' సినిమాలో సన్నివేశమే ఆమె రియల్ జీవితంలో జరిగిందని..అదే తన జీవితమవుతుందని ఊహించలేదన్నారు. `ఆమె` సినిమాలో శ్రీకాంత్-ఊహ మెడలో తాళి కడతారు. అప్పట్లో అది తెరపై పండిన సీన్ అయినా? అదే సన్నివేశం నిజ జీవితంలో కూడా జరగడంతో శ్రీకాంత్ సతీమణి అయ్యారు. `ఆమె` సినిమాలో ఆ పెళ్లి సీన్ తోనే షూటింగ్ మొదలు పెట్టినట్లు గుర్తు చేసుకున్నారు ఊహ. అలాగే శ్రీకాంత్ నటించిన సినిమాల్లో 'తారకరాముడు' సినిమా అంటే ఇష్టమన్నారు.
కోరుకున్న రంగంలోకి పిల్లలు:
ఆ చిత్రాన్ని తన ఫేవరేట్ చిత్రంగా చెప్పుకొచ్చారు. ఆతర్వాత 'ఖడ్గం' సినిమా ఇష్టమన్నారు. అదే శ్రీకాంత్ నటించిన నచ్చని సినిమా కూడా ఒకటి ఉందన్నారు. కానీ ఆ సినిమా పేరు మాత్రం ఇప్పుడు చెప్పకూ డదంటూ స్కిప్ కొట్టారు. అలాగే పిల్లల కెరీర్ విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు తెలిపారు. వారు ఏ రంగంలో రాణించాలనుకుంటే అందులోకి పంపించేందుకు తల్లిదండ్రులుగా తామెప్పుడు సిద్దంగా ఉంటామన్నారు. పెద్ద కుమారుడు రోషన్ ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరో కుమారుడు, కుమార్తె కూడా ఈ దంపతులకు గలరు.
