Begin typing your search above and press return to search.

పూరికి ఇష్ట‌మైన రంగులో ఛార్మీ!

పూరి జగన్నాథ్ ఏ వేడుకలోనైనా? పబ్లిక్ అప్పియరెన్స్‌లోనైనా? ఎప్పుడూ బ్లాక్ అండ్ బ్లాక్ కాస్ట్యూమ్స్‌లోనే ఎక్కువగా కనిపిస్తుంటారు.

By:  Srikanth Kontham   |   3 Aug 2026 3:56 PM IST
పూరికి ఇష్ట‌మైన రంగులో ఛార్మీ!
X

ఇండస్ట్రీలో డైరెక్టర్ పూరి జగన్నాథ్- ఛార్మీ కౌర్ జోడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇద్ద‌రు మంచి స్నేహితులు..నిర్మాణంలో భాగ‌స్వాములు. పూరి సినిమాల‌న్నింటిని ఛార్మీతో క‌లిసి నిర్మిస్తుంటారు. క్రియేటివ్ విభాగంలో కూడా చార్మీ అవ‌స‌రం మేర పాలు పంచుకుంటారు. ఇద్ద‌రి మ‌ధ్య మంచి అండ‌ర్ స్టాండింగ్ ఉంది. తాజాగా ఇద్ద‌రి మ‌ధ్య ఓ పోల‌కి స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ఇటీవల కాలంలో ఛార్మీ ధరించే దుస్తుల ఎంపికలో స్పష్టమైన మార్పు వచ్చింది. పూరి జగన్నాథ్ ఎక్కువగా ఇష్టపడే నలుపు రంగు వైపు ఆమె కూడా పూర్తిగా ఆకర్షితుల వుతుండటం విశేషం.

పూరి జగన్నాథ్ ఏ వేడుకలోనైనా? పబ్లిక్ అప్పియరెన్స్‌లోనైనా? ఎప్పుడూ బ్లాక్ అండ్ బ్లాక్ కాస్ట్యూమ్స్‌లోనే ఎక్కువగా కనిపిస్తుంటారు. నలుపు రంగుపై ఆయనకు ఉన్న మక్కున ఎప్పటి నుంచో అందరికీ తెలిసిందే. పూరి డైరెక్షన్ స్టైల్ లాగే తన డ్రెస్సింగ్ స్టైల్‌లోనూ యూనిక్ బ్రాండ్‌ను మెంటైన్ చేస్తుంటారు. గత కొన్ని సంవత్సరాలుగా పూరి ట్రేడ్‌మార్క్ లుక్ ఇదేనని చెప్పొచ్చు. అయితే గతంలో రకరకాల రంగుల దుస్తులు, మోడ్రన్ ఫ్యాషన్ వేర్‌లో కనిపించిన ఛార్మీ కౌర్ ఇప్పుడు పూరి బాటలోనే నడుస్తున్నారు.

ఈ మధ్య కాలంలో ఛార్మీ ఏ ఫోటోషూట్‌లోనైనా ? సినిమా ఈవెంట్లోనైనా? ఆఫీస్ మీటింగ్స్‌లోనైనా? పూర్తిగా బ్లాక్ అండ్ బ్లాక్ దుస్తులలోనే దర్శనమిస్తున్నారు. పూరి ఇష్టపడే ఈ రంగును ఛార్మీ కూడా దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం విశేషం. ఇద్దరి ఆలోచనా విధానంలో, పనితీరులో ఎంతటి సారుప్య‌త‌ ఉందో వారి స్టైల్ స్టేట్‌మెంట్‌లోనూ అదే రిఫ్లెక్ట్ అవుతోందని చెప్పొచ్చు. ప్రొడక్షన్ హౌస్ బాధ్యతలను చూసుకుంటూ బిజినెస్ వ్యవహారాలను చక్కబెడుతున్న ఛార్మీ సింపుల్ అండ్ పవర్ ఫుల్ లుక్‌ను ఎంచుకోవడం వెనుక ఒక రకమైన ప్రొఫెషనల్ బాండింగ్ కనిపిస్తోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

సెలబ్రిటీల లైఫ్ స్టైల్, వారి ఆహార్యం ఎప్పుడూ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుంటాయి. ఒకరికొకరు వ్యాపార భాగస్వాములుగా, మంచి స్నేహితులుగా ఉన్న జోడీ తమ శైలిలోనూ ఒకే రకమైన ప్రాధాన్యతలను పంచుకోవడం వారి మధ్య ఉన్న అవగాహనకు నిదర్శనంగా నిలుస్తోంది. నలుపు రంగులో ఇద్దరూ ఇస్తున్న వైబ్స్ సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అవుతున్నాయి. సినీ రంగంలో ఇలాంటి భావసారూప్యత కలిగిన వ్యక్తులు కలిసి పని చేయడం వారి ప్రయాణాన్ని మరింత బలోపేతం చేస్తుందనడంలో సందేహం లేదు. పూరి ఇష్టమైన రంగును ఛార్మీ కూడా తన సిగ్నేచర్ స్టైల్‌గా మార్చుకోవడంతో వారి స్నేహ బంధం ఎంత బలమైనదో తెలియజేస్తోంది. త్వ‌ర‌లోనూ పూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న స్ల‌మ్ డాగ్ టెంపుర‌న్ రిలీజ్ కానుంది.