47వేల మంది మగువలతో శృంగారం.. హీరోలో జంతువు రక్తం!
ఒక యువకుడు తన జీవితంలో 100 మంది అమ్మాయిలతో శృంగారంలో పాల్గొనడంపై మీడియాలో కథనాలు చాలా ఉన్నాయి.
By: Sivaji Kontham | 26 Oct 2025 7:00 PM ISTఒక యువకుడు తన జీవితంలో 100 మంది అమ్మాయిలతో శృంగారంలో పాల్గొనడంపై మీడియాలో కథనాలు చాలా ఉన్నాయి. పురాతన కాలంలో స్త్రీలతో శృంగారంలో మునిగి తేలే కాముకుల గురించి అద్భుత కథలున్నాయి. పాండురంగడి శృంగార కేళి కథలకు కొదవేమీ లేదు. కానీ వేలమందితో శృంగార జీవితాన్ని గడిపానని చెప్పుకున్న పూర్వీకులు అరుదు. అలా ప్రకటించుకునేందుకు చాలా ధైర్యం కావాలి. ఈ ప్రముఖ హాలీవుడ్ నటుడు చార్లీ షీన్ తాను జీవితంలో ఏకంగా 47,000 మంది అమ్మాయిలతో శృంగారం చేసానని తాజా పాడ్ కాస్ట్ `ఇంపల్సివ్`లో చెప్పుకొచ్చాడు. తనలో ప్రవహించేది `టైగర్ బ్లడ్` అని వ్యాఖ్యానించిన షీన్, తాను యువకుడిగా ఉన్నప్పుడు ఎంత దూకుడుగా ఉన్నాడో వెల్లడించాడు.
ఆ రోజుల్లో తాను చేసే పని గురించి పెద్దగా ఆలోచించలేదు.. తనకు అంతగా పరిణతి లేదని అంగీకరించాడు. పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లో లోగన్ పాల్‌తో కలిసి కనిపించిన షీన్ జీవితంలో ఎన్నో క్రూరమైన విషయాలున్నాయని తెలిపాడు. తన నిర్ణయాల వెనుక ఎవరో ఆపగలిగే ఒక శక్తి తనకోసం పని చేయలేదని చెప్పాడు. ఆ సమయంలో ఎవరితో షికార్ చేయాలనుకుంటున్నాను? ఏ డ్రగ్స్‌ను ప్రయత్నించాలని అనుకుంటున్నా అది నా ఇష్టం అని తెలిపాడు. తాను 15 సంవత్సరాల వయస్సులో తన వర్జీనిటీని కోల్పోయానని వెల్లడించాడు. ఎల్లో పేజీస్‌లో ఫోన్ నంబర్ తో పరిచయమైన కాండీ అనే మహిళతో తొలి శృంగార రోజులను గుర్తు చేసుకున్నాడు.
సఫారీలో వెళుతూ సింహం దాడి చేస్తుందని భయపడొద్దు.. నా ప్రయాణం కూడా ఇలాగే ధైర్యంగా సాగిందని అన్నాడు. జీవితంలో ఎక్కువ భాగం మాదకద్రవ్యాల వినియోగం, లైంగిక వ్యసనంలో ఎలా మునిగిపోయాడో బహిరంగంగా చెప్పాడు. కానీ కొంతకాలానికి నేను కూడా స్థిరపడ్డాను. 8 సంవత్సరాలు మద్యపానం లేకుండా అదుపులో ఉన్నానని తెలిపాడు.
పార్టీ యానిమల్ లా జీవించడమే కాదు, ఐదేళ్ల కిడ్ కి తండ్రిగా బాధ్యతతో వ్యవహరించానని చార్లీ తెలిపాడు. తన ప్రయాణంపై తాను రాసిన `ది బుక్ ఆఫ్ షీన్` రెండు భాగాల నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీగా విడుదలైంది. అతని ఏకైక అభిమాని కుమార్తె సామి షీన్. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళా ఫ్యాన్స్ షీన్‌కు ఉన్నారు.
పాల్తాన్, వాల్ స్ట్రీట్, ది అరైవల్, హాట్ షాట్స్, స్కారీ మూవీ 3, ది త్రీ మస్కటీర్స్, ది ఛేజ్ లాంటి చిత్రాలతో చార్లీ షీన్ ప్రపంచవ్యాప్తంగా పాపులరయ్యారు.
