చరణ్ రాజ్ కెరీర్‌లో ది బెస్ట్ మూమెంట్.. ఎన్టీఆర్ చెప్పిన ఆ మాటే!
చరణ్ రాజ్ దక్షిణ భారతీయ సినీ పరిశ్రమలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు.
By: Sravani Lakshmi Srungarapu | 13 Aug 2026 10:40 AM ISTచరణ్ రాజ్ దక్షిణ భారతీయ సినీ పరిశ్రమలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సుమారు 400 సినిమాల్లో నటించిన ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో మోస్ట్ మెమొరబుల్ మూమెంట్ ను గుర్తు చేసుకున్నారు. ప్రతిఘటన సినిమాకు నంది అవార్డు రావడం తన సినీ జీవితంలో ది బెస్ట్ మూమెంట్ అని చెప్పడం విశేషం.
ఈ అవార్డు తీసుకోవడానికి తాను క్లీన్ షేవ్ చేసుకుని వైట్ అండ్ వైట్ దుస్తుల్లో వెళ్లానని చెప్పారు. అదే టైమ్ లో అక్కడున్న సీనియర్ ఎన్టీఆర్ తనను చూసి గుర్తుపట్టలేదని, చరణ్ రాజ్ గారబ్బాయా? అని అడిగారని గుర్తు చేసుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రతిఘటన సినిమాను ఎన్టీఆర్ ఒక్కసారి కాదు, రెండుసార్లు చూసినప్పటికీ తనను వెంటనే గుర్తించలేదని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ ప్రతిఘటన సినిమాను రెండు సార్లు చూశారన్న విషయాన్ని రామోజీ రావు గారే తనకు చెప్పారని కూడా వెల్లడించారు.
తర్వాత పక్కనే ఉన్నవారు ఇతనే చరణ్ రాజ్ అని చెప్పగానే ఎన్టీఆర్ వెంటనే మైక్ తీసుకుని అందరి ముందు చూడండి, ఆర్టిస్ట్ అంటే ఇలా ఉండాలి అంటూ తన యాక్టింగ్ ను, క్యారెక్టర్ కోసం చేసిన మేకోవర్ ను ప్రశంసించారని చెప్పారు. ఒక నటుడికి ఇలాంటి గుర్తింపు అవార్డు కంటే కూడా గొప్పదని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సంఘటన చరణ్ రాజ్ కెరీర్‌లో కేవలం ఒక అవార్డు జ్ఞాపకంగా మాత్రమే కాకుండా, యాక్టర్ గా తన ట్రాన్స్‌ఫార్మేషన్‌కు వచ్చిన అత్యున్నత గుర్తింపుగా నిలిచింది. ఒక పాత్రలో పూర్తిగా లీనమై, నిజ జీవితంలో చూసినప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోవడం అరుదైన యాక్టింగ్ క్వాలిటీగా సినీ వర్గాలు భావిస్తాయి. ఎన్టీఆర్ వంటి దిగ్గజ నటుడు నుంచి అలాంటి ప్రశంసలు అందుకోవడం చరణ్ రాజ్ కెరీర్‌కు ప్రత్యేకమైన మైలురాయిగా చెప్పవచ్చు.
ఆర్థిక క్రమశిక్షణ, ఆస్తుల్లో పెట్టుబడులు, సాధారణ జీవనశైలిపై ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. అయితే వాటన్నింటికంటే ప్రతిఘటనతో వచ్చిన నంది అవార్డు, ఎన్టీఆర్ ప్రశంసలు తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని అనుభవంగా మిగిలిపోయాయని చరణ్ రాజ్ చెప్పిన మాటలు ఆయన కెరీర్‌కు ఉన్న ఎమోషనల్ వాల్యూని మరోసారి గుర్తు చేశాయి.
