Begin typing your search above and press return to search.

త్రిగుణ్ కి ఎలివేషన్ ఇచ్చిన 'చరణ్ రీ-ఎంట్రీ'

అగ్నిపరీక్ష రియాలిటీ షో లో జూరీ మెంబర్స్ అందరి చేత గ్రీన్ కార్డు తీసుకొని, షో లో కూడా బాగా పార్టిసిపేట్ చేసి బిగ్ బాస్ షో లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్ చరణ్.

By:  Priya Chowdhary Nuthalapti   |   18 Sept 2026 9:28 AM IST
త్రిగుణ్ కి ఎలివేషన్ ఇచ్చిన చరణ్ రీ-ఎంట్రీ
X

అగ్నిపరీక్ష రియాలిటీ షో లో జూరీ మెంబర్స్ అందరి చేత గ్రీన్ కార్డు తీసుకొని, షో లో కూడా బాగా పార్టిసిపేట్ చేసి బిగ్ బాస్ షో లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్ చరణ్. అయితే మొదటి మూడు రోజులు పేలవ ప్రదర్శన వల్ల చరణ్ ఇంట్లో వాళ్ళని మెప్పించే ప్రయత్నం చేయలేక పోయాడు. అదే విధంగా పార్టిసిపెంట్స్ అందరి డెసిషన్ కారణంగా ఇంట్లో నుంచి బయటకు రావడం జరిగింది. మొదటి వారం మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయిన ఇద్దరిలో చరణ్ ఒకడు. అయితే అనూహ్య పరిణామాల మధ్య చరణ్ మళ్ళీ షో కి రీ ఎంట్రీ ఇచ్చాడు.

ఈ సారి పదో సీజన్ కారణంగా దశావతారాలు అనే థీమ్ తో బిగ్ బాస్ షో మన ముందుకు వచ్చింది. అయితే రెండో వారం లో రెండో అవతారం లో భాగంగా, పవర్ ఆఫ్ పీపుల్ అనే కాన్సెప్ట్ కి అనుగుణంగా ఆడియన్స్ కోరిక మేరకు చరణ్ ని మళ్ళీ ఇంట్లోకి పంపించారు. చరణ్ తిరిగొచ్చాక రోహిత్ కి ప్లస్ అవుతుంది అనుకుంటే అది కాస్త త్రిగుణ్ కి ఎలివేషన్ గా మారింది. చరణ్ రోహిత్ లు ఇద్దరూ ఫ్రెండ్స్ అవడం వల్ల, రోహిత్ కి త్రిగుణ్ కి తరచూ గొడవలు అయితున్న కారణంగా చరణ్ తిరిగి వచ్చి రోహిత్ కి మంచి బూస్ట్ ఇస్తాడు అని అంతా అనుకున్నారు.

కెప్టెన్సీ కంటెండర్ అయ్యే క్రమం లో త్రిగుణ్ ని టార్గెట్ చేసి గెలుద్దాం అని చరణ్ ప్లాన్ చేసాడు. అందుకు అనుగుణంగా బిగ్ బాస్ కూడా ఒక టాస్క్ ఇచ్చాడు. అయితే ఈ టాస్క్ లో పాల్గొనే ముందు త్రిగుణ్ కెప్టెన్ అవ్వడానికి అనర్హుడు అని చెప్తూ చరణ్ కొన్ని కారణాలు చెప్పాడు. త్రిగుణ్ ఏ మాత్రము డిఫెండ్ చేసుకోకుండా ఆటలో నే తన సత్తా చూపిద్దాం అనుకున్నాడు.

అదే విధంగా, చరణ్ మీద ఆడి, అతన్ని ఓడించాడు త్రిగుణ్. చివరికి చరణ్ ఓడిపోవడం తో అది త్రిగుణ్ కి ఎలివేషన్ ఇచ్చినట్టు గా మారింది. దీంతో త్రిగుణ్ కి మరింత ఉత్సాహం వచ్చినట్టైంది.