Begin typing your search above and press return to search.

'నేనెందుకు సారీ చెప్పాలి?'.. చంద్రహాస్ మళ్లీ సేమ్ క్వశ్చన్

ఇప్పుడు తన లేటెస్ట్ మూవీ బరాబర్ ప్రేమిస్తా ప్రమోషనల్ ఈవెంట్ లో గుంజి గుంజి.. సాంగ్ పాడి మరిన్ని విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

By:  M Prashanth   |   6 Feb 2026 3:37 PM IST
నేనెందుకు సారీ చెప్పాలి?.. చంద్రహాస్ మళ్లీ సేమ్ క్వశ్చన్
X

బుల్లితెర స్టార్ యాక్టర్ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ గురించి అందరికీ తెలిసిందే. రామ్ నగర్ బన్నీ మూవీతో హీరోగా పరిచయమైన అతనికి.. డెబ్యూ రిలీజ్ కు ముందే ఒక స్టేజ్ ఈవెంట్‌ లో ప్రవర్తించిన తీరుతో యాటిట్యూడ్ స్టార్ వచ్చేసింది. ఆ సమయంలో చంద్రహాస్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. ఆ సమయంలో అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు.

ఇప్పుడు తన లేటెస్ట్ మూవీ బరాబర్ ప్రేమిస్తా ప్రమోషనల్ ఈవెంట్ లో గుంజి గుంజి.. సాంగ్ పాడి మరిన్ని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఆ పాటలో బూతు పదాలు ఉండడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారాడు. ఆ విషయంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. సాంగ్ లో వినిపించిన బూతు పదాలపై నెటిజన్లు సహా అనేక మంది సెలబ్రిటీలు విమర్శలు గుప్పిస్తున్నారు.

ముఖ్యంగా యువతపై ఇలాంటి పదాలు చెడు ప్రభావం చూపుతాయని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. సారీ చెప్పి పాటను వెనక్కి తీసుకోవాలని అనేక మంది డిమాండ్ చేశారు. కానీ చంద్రహాస్.. రీసెంట్ గా వీడియో రిలీజ్ చేసి.. ఒకప్పుడు తనపై చాలా విమర్శలు చేశారని, దాన్ని క్రిటిసిజంగా తీసుకున్నానని తెలిపాడు. ఇప్పుడు సారీ చెప్పమని అడిగినోళ్ళు అప్పుడు ఎందుకు అడగలేదని అన్నాడు.

ఇప్పుడు మరోసారి అదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. "పాట విషయంలో నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి? నా ఉద్దేశం ఎవరినీ లక్ష్యంగా చేసుకోనప్పుడు, ప్రజలు నన్ను క్షమాపణ ఎందుకు అడుగుతున్నారు? మొదటి రోజు నుంచే నన్ను లక్ష్యంగా చేసుకుంటున్నప్పుడు, దాని గురించి అప్పుడు ఆ విషయంలో ఎవరూ ఎందుకు ప్రశ్నించలేదు?" అని చంద్రహాస్ క్వశ్చన్ చేశాడు.

అంతే కాదు.. అప్పుడు సోషల్ మీడియాలో నాకు కలిగిన బాధ వల్ల తాను ఆత్మహత్య చేసుకుని ఉంటే? ఏమయ్యేదని అడిగాడు. దానికి మీరు సమాధానం చెప్పలేనప్పుడు, ఇప్పుడు పాట కోసం తనను క్షమాపణ చెప్పమని ఎందుకు అడుగుతున్నారని అన్నాడు. ఇప్పుడు చంద్రహాస్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.

అయితే ఇప్పటికే చంద్రహాస్ పై హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సీనియర్ జర్నలిస్ట్ అశోక్ వేములపల్లి చంద్రహాస్ పై ఫిర్యాదు చేయగా.. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా మరో కేసు కూడా నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా చంద్రహాస్ మాత్రం సారీ చెప్పడానికి అంగీకరించడం లేదు. తాను అస్సలు సారీ చెప్పనని తేల్చి చెబుతున్నాడు. మరి ఈ వ్యవహారంలో చివరకు ఏం జరుగుతుందో వేచి చూడాలి.