Begin typing your search above and press return to search.

చంద్రబాబు నాయుడి బయోపిక్.. ప్లాన్ గట్టిగానే..

చంద్రబాబు నాయుడు ఒక యువ నాయకుడి నుండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, జాతీయ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన తీరును ఈ కథలో ప్రధానంగా చూపించబోతున్నట్లు సమాచారం.

By:  M Prashanth   |   22 April 2026 4:13 PM IST
చంద్రబాబు నాయుడి బయోపిక్.. ప్లాన్ గట్టిగానే..
X

రాజకీయ నాయకుల జీవిత కథలను వెండితెరపై ఆవిష్కరించడం ఎప్పుడూ ఒక సవాలే. రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతల బయోపిక్ లు వస్తున్నాయంటే సహజంగానే అందరిలోనూ ఆసక్తి మొదలవుతుంది. ఇప్పటికే టాలీవుడ్ లో చాలా మంది ప్రముఖుల కథలు సినిమాల రూపంలో వచ్చాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవిత ప్రస్థానాన్ని కూడా ఒక భారీ చిత్రంగా మలచడానికి సిద్ధమవుతున్నారు.

ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎదురైన ఒడిదుడుకులు, సాధించిన విజయాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘రాజధాని ఫైల్స్’ సినిమాతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు భాను ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా, ఈ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో ప్లాన్ చేయనున్నారట.

చంద్రబాబు నాయుడు ఒక యువ నాయకుడి నుండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, జాతీయ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన తీరును ఈ కథలో ప్రధానంగా చూపించబోతున్నట్లు సమాచారం. ఒక విజనరీ లీడర్ గా ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఐటీ రంగంలో తెచ్చిన మార్పుల చుట్టూ ఈ స్క్రిప్ట్ సాగుతుందని టాక్. నిజానికి చంద్రబాబు నాయుడు జీవితంపై గతంలోనూ కొన్ని సినిమాలు వచ్చాయి.

అయితే ఈసారి రాబోయే చిత్రం ఆయన పూర్తిస్థాయి బయోపిక్ గా ఉండబోతోందని చిత్ర యూనిట్ చెబుతోంది. రాజకీయంలో ఆయన వేసిన ఎత్తుగడలు, హైటెక్ సిటీ నిర్మాణం నుండి నేటి అమరావతి వరకు సాగిన ఆయన విజన్ ను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపిస్టారట. షూటింగ్ టైటిల్ కు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ భారీ ప్రాజెక్టులో చంద్రబాబు పాత్రను ఎవరు పోషిస్తారనేది ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఒక పొలిటికల్ డ్రామాను ఏకపక్షంగా కాకుండా, వాస్తవాలకు దగ్గరగా ఉంటూనే ఒక పర్ఫెక్ట్ కథగా మలచాలని భాను ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో వచ్చిన మలుపులు, సవాళ్లను దాటుకుని మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకున్న తీరు ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చేలా ఉండబోతోందట. టెక్నికల్ గా కూడా ఈ సినిమాను హై స్టాండర్డ్స్ లో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి.