ఘనంగా ఆస్కార్ విజేత చంద్రబోస్ కొడుకు పెళ్లి.. కోడలి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
సెప్టెంబర్ 6 రాత్రి 7:00 గంటల సమయంలో హైదరాబాద్, హైటెక్ సిటీ , శిల్పారామంలో నందు - శృతిల రిసెప్షన్ ఘనంగా జరిగింది.
By: Madhu Reddy | 7 Sept 2026 3:19 PM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గేయ రచయితగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న చంద్రబోస్ ఇంట ఘనంగా పెళ్లి వేడుకలు జరిగాయి. ఆయన కొడుకు నందు వనమాలి పెళ్లి హనుమకొండలో సినీ సెలబ్రిటీలు, అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమానికి చిరంజీవిని మొదలుకొని డైరెక్టర్ సుకుమార్ దంపతులతో పాటు ఎంతోమంది సెలబ్రిటీలు ఈ వేడుకల్లో సందడి చేశారు.
ఘనంగా చంద్రబోస్ కుమారుడి పెళ్లి..
ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ , కొరియోగ్రాఫర్ సుచిత్ర దంపతుల కుమారుడు నంద వనమాలి అలియాస్ నందు.. ఉషాకోయిల చంద్రకళ - ప్రకాష్ దంపతుల ఏకైక కుమార్తె శృతి తో సెప్టెంబర్ 4 ఉదయం 10:28 గంటల సుముహూర్తంలో హనుమకొండలోని శ్యామ్ పేటలో ఉన్న డి -కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ వివాహం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చంద్రబోస్ కుమారుడు నందు, శృతి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నెటిజన్స్.
రిసెప్షన్ కి హాజరైన సెలబ్రిటీస్..
సెప్టెంబర్ 6 రాత్రి 7:00 గంటల సమయంలో హైదరాబాద్, హైటెక్ సిటీ , శిల్పారామంలో నందు - శృతిల రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ దిగ్గజాలైన మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, డైరెక్టర్ సుకుమార్ దంపతులు, డైరెక్టర్ సందీప్ రెడ్డి , ఎం ఎం కీరవాణి, బ్రహ్మానందం వంటి తారలు ఈ వేడుకల్లో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నంద వనమాలి - శృతి జంట చూడ చక్కగా ఉంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
చంద్రబోస్ కోడలి బ్యాక్ గ్రౌండ్..
ఇకపోతే పెళ్లి వేడుకలలో అందరి దృష్టి శృతి పైనే పడింది. ఎవరు ఈమె? బ్యాక్ గ్రౌండ్ ఏంటి ? ఇలా కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం .. శృతి సినిమా రంగానికి చెందిన అమ్మాయి కాదు ఈమె ఒక సాధారణ సాంప్రదాయ కుటుంబానికి చెందిన యువతీ అని సమాచారం
.ముఖ్యంగా చంద్రబోస్ కుటుంబసభ్యులు ఈ సంబంధాన్ని నిశ్చయించినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే చంద్రబోస్ కోడలు అందరి దృష్టిని ఆకట్టుకోవడమే కాకుండా వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
తాజ్ మహల్ తో మొదలైన ప్రయాణం.. ఆస్కార్ వరకు..
1995లో వచ్చిన తాజ్ మహల్ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన చంద్రబోస్.. గేయ రచయితగా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు. నిజానికి ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈయన .. చిన్నప్పటి నుండే పాటల మీద మక్కువతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. పాటల రచయిత గానే కాకుండా నేపథ్య గాయకుడిగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్న చంద్రబోస్, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకొని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు.
