చందమామలా ఆకట్టుకుంటున్న చాందిని!
అందులో భాగంగానే తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారిన చాందిని.. సాంప్రదాయమైన చుడీదార్ లో కనిపించి అందరి మనసులు దోచుకుంది.
By: Madhu Reddy | 5 Nov 2025 10:00 PM ISTచేసేది తక్కువ సినిమాలే అయినా.. అటు అతిథి పాత్రలలో కాసేపు కనిపించినప్పటికీ తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది చాందిని చౌదరి. నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాలో శివాని పాత్రతో అందరినీ ఆకట్టుకుంది. ఇందులో చేసింది గెస్ట్ పాత్ర అయినా తన పాత్రతో అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు సంతాన ప్రాప్తిరస్తు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నవంబర్ 14వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు పెంచడానికి ఇటు సోషల్ మీడియాలో ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టింది ఈ ముద్దుగుమ్మ.
అందులో భాగంగానే తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారిన చాందిని.. సాంప్రదాయమైన చుడీదార్ లో కనిపించి అందరి మనసులు దోచుకుంది. సాంప్రదాయంగా గ్రీన్ కలర్ చుడీదార్ ధరించి.. జుట్టును కాస్త స్టైల్ చేసి వదిలేసిన ఈమె.. చెవులకు పెద్ద చెవి పోగులు పెట్టుకొని.. తన అందాన్ని మరింత మార్చుకుంది. ఇక మెడను బోసిగా ఉంచిన ఈమె అలా సింపుల్ లుక్ తో అందరి హృదయాలను ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. తాజాగా చాందిని చౌదరి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
చాందిని చౌదరి తాజాగా నటిస్తున్న సంతాన ప్రాప్తిరస్తు సినిమా విషయానికి వస్తే.. విక్రాంత్, చాందిని జంటగా నటిస్తున్న ఈ సినిమాను మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి , నిర్వి హరి ప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా మొదటి పాట ' తెలుసా నీకోసమే' లిరికల్ సాంగ్ ను ప్రొడ్యూసర్ సురేష్ బాబు గెస్ట్ గా వచ్చి రిలీజ్ చేశారు. డైరెక్టర్ అజరు అరసాడ ఈ పాటను చాలా అద్భుతంగా కంపోజ్ చేయగా.. శ్రీమణి లిరిక్స్ అందించారు. తన అద్భుతమైన గాత్రంతో పాట పాడి శ్రోతలను అలరించారు.
కేటుగాడు సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చాందిని కలర్ ఫోటో సినిమాతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆ తర్వాత సమ్మతమే, గామి వంటి చిత్రాలలో నటించిన ఈమె విశాఖపట్నంలో పుట్టి బెంగళూరులో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరియర్ ఆరంభించిన ఈమె.. షార్ట్ ఫిలిమ్స్ క్వీన్ అనే బిరుదును కూడా దక్కించుకుంది. 1991 అక్టోబర్ 23న జన్మించిన చాందిని షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే తన నటనను ప్రూవ్ చేసుకొని ఇప్పుడు హీరోయిన్ గా చలామణి అవుతుంది. ఇక త్వరలో రాబోతున్న సంతాన ప్రాప్తిరస్తు సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
