Begin typing your search above and press return to search.

గంగానమ్మ బోనం ఎత్తిన హీరోయిన్‌

అందులో భాగంగా చాందిని ఏలూరు లో ఆదివారం జరిగిన గంగానమ్మ జాతరలో పాల్గొంది.

By:  Ramesh Palla   |   17 Nov 2025 11:45 AM IST
గంగానమ్మ బోనం ఎత్తిన హీరోయిన్‌
X

టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలు గుర్తింపు దక్కించుకోవడం కష్టం, వారికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు తక్కుగా ఉంటాయి అనే విషయం తెల్సిందే. తెలుగు అమ్మాయిలకు చిన్న చిన్న పాత్రలు ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. అతి కొద్ది మంది హీరోయిన్స్ తెలుగు వారు అయినప్పటికీ చిన్న సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకుంటున్నారు. తెలుగు అమ్మాయిలు హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుని, కంటిన్యూస్‌గా సినిమాలు చేస్తున్న వారిలో చాందిని చౌదరి ఒకరు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జూనియర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్ ను ఆరంభించిన ఈమె క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సినిమాలు చేసింది, డైలాగ్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేసింది, చివరకు హీరోయిన్‌గానూ సినిమాలు చేసింది. పదేళ్ల కాలంలో ఈమె నుంచి ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో పలు మంచి సినిమాలు ఉండటంతో ఈమె ఇప్పటికీ ఆఫర్లు దక్కించుకుంటుంది.

లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ సినిమాతో ఎంట్రీ...

2012లో వచ్చిన లైఫ్ ఈజ్‌ బ్యూటీఫుల్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నోటెడ్‌ అయింది. ఆ సినిమాలో ఈమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా కూడా కాస్త గుర్తించే పాత్రను చేయడం ద్వారా దాన్ని తన మొదటి సినిమాగా ఈమె చెప్పుకుంటుంది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో ప్రాధాన్యత లేని సినిమాల్లో నటించింది. ఈమెకు హీరోయిన్‌గా 2020లో వచ్చిన కలర్‌ ఫోటో సినిమా గుర్తింపు తెచ్చి పెట్టింది. అంతకు ముందు ఆ తర్వాత చేసిన చాలా సినిమాలు కలర్‌ ఫోటో సినిమా స్థాయిలో నడిచిందే లేదు. దాంతో ఆ సినిమాలు చాందినికి గుర్తింపు తెచ్చి పెట్టలేదు. అయినా కూడా ఉత్తరాది ముద్దుగుమ్మలకు ఏమాత్రం తగ్గకుండా చాందిని అందంగా ఉండటం వల్ల తెలుగు దర్శకులు ముఖ్యంగా చిన్న హీరోలకు ఈమెను హీరోయిన్‌గా తీసుకోవడం జరుగుతుంది. తాజాగా మరో సినిమాతో చాందిని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

బోనం ఎత్తిన హీరోయిన్‌ చాందిని చౌదరి

చాందిని తాజాగా సంతాన ప్రాప్తిరస్తు సినిమాలో నటించింది. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో యూనిట్‌ సభ్యులతో కలిసి ఆమె చెక్కర్లు కొడుతోంది. అందులో భాగంగా చాందిని ఏలూరు లో ఆదివారం జరిగిన గంగానమ్మ జాతరలో పాల్గొంది. ఆ సమయంలో చాందిని బోనం ఎత్తి అమ్మవారికి మొక్కులు చెల్లించింది. సాధారణంగానే హీరోయిన్స్ ఇలాంటి జాతర ఉత్సవాలకు దూరంగా ఉంటారు. అలాంటిది గంగానమ్మ జాతరలో చాందిని బోనం ఎత్తడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం చాందిని బోనం ఎత్తిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తెలుగు అమ్మాయి అయిన చాందిని ఇలా తెలుగు ఆచార సాంప్రదాయాలను పాటించడం చాలా సంతోషంగా ఉందని ఆమె అభిమానులు అంటున్నారు. చాందిని సినిమాలు ముందు ముందు మరిన్ని రావాలని వారు కోరుకుంటున్నారు.

సంతాన ప్రాప్తిరస్తు సినిమాతో ప్రేక్షకుల ముందుకు

విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంతాన ప్రాప్తిరస్తు సినిమా ప్రమోషన్‌లో భాగంగా చాందిని చిత్ర యూనిట్‌ సభ్యులతో కలిసి తెలుగు రాష్ట్రాల్లో యాత్రలో పాల్గొంది. సినిమా విడుదల సమయంలోనూ చాందిని చాలా కష్టపడి సినిమాను ప్రమోట్‌ చేయడం జరిగింది. హీరోయిన్‌గా వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ తనక ఇచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చాందిని చౌదరి ముందు ముందు పెద్ద హీరోల సినిమాల్లో కూడా నటించే విధంగా గుర్తింపు దక్కించుకుంటుంది అనే విశ్వాసంను అంతా వ్యక్తం చేస్తున్నారు. తన అందంతో పాటు, అభినయంతో ఈ సినిమాలో మెప్పించడం ద్వారా మరింత మంది అభిమానులను చాందిని సొంతం చేసుకుంది. చాందిని క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, ఆమె అందం వల్ల పదేళ్లు అయినా టాలీవుడ్‌లో కొనసాగుతోందని కొందరు అంటూ ఉంటారు.