Begin typing your search above and press return to search.

హైదరాబాద్‌ పై బాలీవుడ్ ఫోకస్.. ఆ టీజర్‌ తో ఫుల్ క్లియర్..

ఆ చిత్రానికి మరో మెయిన్ అట్రాక్షన్ హైదరాబాద్ లొకేషన్లు. నగరంలోని దుర్గం చెరువు, హుస్సేన్ సాగర్, అలాగే నిఫ్ట్ క్యాంపస్ వంటి ప్లేసెస్ ను అందంగా చూపించారు.

By:  M Prashanth   |   7 April 2026 8:00 PM IST
హైదరాబాద్‌ పై బాలీవుడ్ ఫోకస్.. ఆ టీజర్‌ తో ఫుల్ క్లియర్..
X

బాలీవుడ్ సినిమాల దృష్టి మళ్లీ హైదరాబాద్ వైపు మళ్లుతుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వాటికి ఇప్పుడు పెర్ఫెక్ట్ ఉదాహరణగా నిలుస్తోంది చాంద్ మేరా దిల్ చిత్రం. బీటౌన్ యంగ్ హీరో లక్ష్య, క్రేజీ బ్యూటీ అనన్య పాండే జంటగా నటిస్తున్న ఆ సినిమా తాజాగా విడుదలైన టీజర్‌ తోనే ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఆ సినిమా హైదరాబాద్ నేపథ్యంతో తెరకెక్కడం విశేషంగా మారింది.

ఇటీవల విడుదలైన టీజర్‌ ను గమనిస్తే.. ప్యూర్ క్యాంపస్ లవ్ స్టోరీగా తెలుస్తోంది. ఇంజనీరింగ్ కాలేజీ నేపథ్యంలో ఆరవ్, చాందిని అనే ఇద్దరు విద్యార్థుల మధ్య మొదలయ్యే ప్రేమ కథ చుట్టూ సినిమా తిరుగుతుందని అర్థమవుతోంది. మొదట్లో సరదాగా సాగిపోయే ఆ ప్రేమ, ఆ తర్వాత జీవితంలో ఎదురయ్యే అనుకోని మలుపులు, భావోద్వేగ సంఘటనలతో మరింతగా డీప్ గా మారుతుందని టీజర్ సూచిస్తోంది.

ఆ చిత్రానికి మరో మెయిన్ అట్రాక్షన్ హైదరాబాద్ లొకేషన్లు. నగరంలోని దుర్గం చెరువు, హుస్సేన్ సాగర్, అలాగే నిఫ్ట్ క్యాంపస్ వంటి ప్లేసెస్ ను అందంగా చూపించారు. ఆ లొకేషన్లు సినిమాకు స్పెషల్ విజువల్ ఫీల్‌ ను తీసుకురావడమే కాకుండా, తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా అనిపించేలా చేస్తున్నాయి. హైదరాబాద్ నగర అందాలు బాలీవుడ్ మళ్ళీ తెరపైకి తీసుకురావడం ఆసక్తికరంగా మారింది.

ఇటీవలి కాలంలో బాలీవుడ్ సినిమాలు హైదరాబాద్‌ లో షూటింగ్ జరపడం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. మంచి ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్, విభిన్నమైన లొకేషన్లతోపాటు సౌకర్యవంతమైన షూటింగ్ వాతావరణం కారణంగా నిర్మాతలు హైదరాబాద్ ను ఎక్కువగా ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. చాంద్ మేరా దిల్ కూడా ట్రెండ్‌ ను కొనసాగిస్తున్న చిత్రం అని చెప్పవచ్చు.

అయితే మ్యూజిక్ పరంగా కూడా సినిమా స్ట్రాంగ్ గా ఉండబోతుందని టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. సచిన్- జిగర్ అందించిన మ్యూజిక్ ఆ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచేలా ఉంది. టీజర్ బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ ఎమోషన్స్ ను బాగా హైలైట్ చేస్తోంది. అసలు ఆ సినిమా ఏప్రిల్‌ లోనే విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు మే 22న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

ఇప్పటికే టీజర్‌ తో మంచి బజ్ సృష్టించిన ఆ చిత్రం, విడుదలకు దగ్గర పడే కొద్దీ మరింత హైప్ తెచ్చుకునే అవకాశం ఉంది. మొత్తానికి చాంద్ మేరా దిల్ టీజర్ చూస్తే ఇది కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా, భావోద్వేగాలతో నిండిన యూత్‌ ఫుల్ డ్రామా అని అర్థమవుతోంది. హైదరాబాద్ బ్యాక్‌ డ్రాప్, కొత్త జంట కెమిస్ట్రీ, సంగీతం.. అన్నీ కలిపి ఆ సినిమాను ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసేలా చేస్తున్నాయి. మరి మే 22న రానున్న చాంద్ మేరా దిల్ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.