Begin typing your search above and press return to search.

ఛాంపియన్ ఈసారి ఎమోషనల్ మెలోడీ..!

ఇక ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ సల్లంగుండాలే కూడా రీసెంట్ గా ప్రోమోతో ఇంప్రెస్ చేయగా లేటెస్ట్ గా ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు.

By:  Ramesh Boddu   |   9 Dec 2025 1:42 PM IST
ఛాంపియన్ ఈసారి ఎమోషనల్ మెలోడీ..!
X

రోషన్, అనస్వర రాజన్ జోడీగా ప్రదీప్ అధ్వైతం డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఛాంపియన్. స్వప్న సినిమాస్ బ్యానర్ లో స్వప్న దత్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. క్రిస్ మస్ బరిలో డిసెంబర్ 25న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ గా రిలీజైన గిర గిర సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఆ సాంగ్ తోనే ఛాంపియన్ సినిమా మీద విపరీతమైన బజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ సల్లంగుండాలే కూడా రీసెంట్ గా ప్రోమోతో ఇంప్రెస్ చేయగా లేటెస్ట్ గా ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు.




ఛాంపియన్ సల్లంగుండాలే సాంగ్..

ఛాంపియన్ సినిమాలో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి స్పెషల్ రోల్ లో నటిస్తున్నారు. 3 దశాబ్దాల తర్వాత ఆయన మళ్లీ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఛాంపియన్ సినిమాలో రెండో సాంగ్ సల్లగుండాలే సాంగ్ ఆయన మీదే తెరకెక్కించారు. కూతురు పెళ్లి టైం లో తండ్రి తన ఆనందాన్ని, బాధని ఒకేసారి ఏర్చి కూర్చి పాడితే ఎలా ఉంటుందో సల్లంగుండాలే సాంగ్ అలా ఉంది. మిక్కీ జే మేయర్ మరో అద్భుతమైన మెలోడీ ట్యూన్స్ ఈ సాంగ్ కి ఇచ్చారు.

చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఈ సాంగ్ ని మనీష, రితేష్ జి రావు ఆలపించారు. సాంగ్ లో మధ్యలో డ్యాన్స్ మూమెంట్స్ లో హీరో రోషన్ హీరోయిన్ అనస్వర కూడా అదరగొట్టారు. ఈ సినిమాతో రోషన్, అనస్వర జోడీ సూపర్ క్రేజ్ తెచ్చుకునేలా ఉంది. పీరియాడికల్ స్టోరీగా రాబోతున్న ఈ ఛాంపియన్ సినిమా నుంచి ఆమధ్య వచ్చిన టీజర్ ఇంప్రెస్ చేసింది. ఇప్పుడు సినిమా నుంచి వస్తున్న సాంగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి.

రోషన్ ని హీరోగా నిలబెట్టేలా..

డిసెంబర్ 25 క్రిస్మస్ రేసులో మంచి బజ్ తో ఈ సినిమా రాబోతుంది. ఆల్రెడీ సినిమా సాంగ్స్ తో ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్ ఈవెంట్స్ తో కూడా హడావిడి చేయబోతుంది. రోషన్ ని హీరోగా నిలబెట్టేలా బాక్సాఫీస్ ఛాంపియన్ గా ఈ సినిమా నిలుస్తుందా లేదా అన్నది చూడాలి.

కథలో కొత్తదనం స్టోరీ ఎగ్జిక్యూషన్ సరిగా ఉంటే ఈమధ్య ఆడియన్స్ సినిమాలో కాస్టింగ్ ఎవరన్నది పెద్దగా పట్టించుకోకుండానే సూపర్ హిట్ చేస్తున్నారు. అలాంటిది స్వప్న సినిమాస్ నుంచి వస్తున్న ఈ ఛాంపియన్ సినిమా కంటెంట్ తో పాటు హై క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్ తో వస్తుంది. సో క్రిస్ మస్ ఫైట్ లో ఈ సినిమా ఒక మంచి ఇంపాక్ట్ చూపించే సినిమాగా రాబోతుందని చెప్పొచ్చు. రోషన్ అండ్ అనస్వర ఫ్రెష్ జోడీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రమోషన్స్ లో కూడా ఈ ఇద్దరిని దించితే యూత్ కి ఈజీగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.