'ఛాంపియన్' కోసం స్టార్స్ ఛాలెంజ్.. ప్రభాస్ ఆన్సర్ కోసం వెయిటింగ్!
సినిమా టైటిల్ 'ఛాంపియన్' కాబట్టి, అసలు మీ లైఫ్ లో మీకు స్ఫూర్తినిచ్చిన నిజమైన ఛాంపియన్ ఎవరు? అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ #MyChampion ట్రెండ్ ని క్రియేట్ చేశారు.
By: M Prashanth | 23 Dec 2025 4:05 PM ISTటాలీవుడ్ లో సినిమా ప్రమోషన్స్ అంటే కేవలం ఇంటర్వ్యూలు, ఈవెంట్లే కాకుండా కొత్తగా ఏదైనా చేస్తేనే జనాలు కనెక్ట్ అవుతున్నారు. సరిగ్గా ఇదే స్ట్రాటజీని 'ఛాంపియన్' సినిమా టీమ్ ఫాలో అవుతోంది. రోషన్ మేక హీరోగా వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను వెరైటీగా ప్లాన్ చేశారు. సోషల్ మీడియాలో ఒక చైన్ రియాక్షన్ లాగా స్టార్ హీరోలను ఇన్వాల్వ్ చేస్తూ చేస్తున్న క్యాంపెయిన్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సినిమా టైటిల్ 'ఛాంపియన్' కాబట్టి, అసలు మీ లైఫ్ లో మీకు స్ఫూర్తినిచ్చిన నిజమైన ఛాంపియన్ ఎవరు? అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ #MyChampion ట్రెండ్ ని క్రియేట్ చేశారు. ఇది కేవలం సినిమా ప్రమోషన్ లా కాకుండా, సెలబ్రిటీల పర్సనల్ ఎమోషన్స్ ని బయటపెట్టే వేదికగా మారింది. ఒక స్టార్ హీరో తన ఛాంపియన్ గురించి చెప్పి, మరో స్టార్ ని నామినేట్ చేయడం ఇందులో ఉన్న ఆసక్తికరమైన అంశం.
ఈ చైన్ ప్రాసెస్ లో విజయ్ దేవరకొండ మొదట స్పందిస్తూ.. తాను వేసే ప్రతి అడుగు, తనపై తనకున్న నమ్మకమే తన ఛాంపియన్ అని చెప్పి దుల్కర్ సల్మాన్ ని నామినేట్ చేశారు. దానికి దుల్కర్ స్పందిస్తూ తన తండ్రే తన ఆల్ టైమ్ ఛాంపియన్ అని చెప్పాడు. అక్కడి నుంచి నాగ్ అశ్విన్, నాని, సందీప్ రెడ్డి వంగా వరకు ఈ చైన్ కొనసాగింది. నాని, నాగ్ అశ్విన్, సందీప్ వంగా ముగ్గురూ తమ తల్లులే తమకు రియల్ లైఫ్ ఛాంపియన్స్ అని ఎమోషనల్ గా రిప్లై ఇచ్చారు.
అయితే అసలైన సస్పెన్స్ ఇక్కడే క్రియేట్ చేశారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన ఛాంపియన్ గురించి చెప్పిన తర్వాత, ఈ ప్రశ్నను రెబల్ స్టార్ ప్రభాస్ కు పాస్ చేశారు. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ప్రభాస్ ఆన్సర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. "ఆల్ ఐస్ ఆన్ రెబల్ స్టార్ ప్రభాస్" అంటూ వీడియోలో ఇచ్చిన హింట్ తో ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పీక్స్ కి చేరింది. ప్రభాస్ లైఫ్ లో ఛాంపియన్ ఎవరు అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
రోషన్ లాంటి యంగ్ హీరో సినిమాకు ఇంతమంది స్టార్స్ సపోర్ట్ దొరకడం, వాళ్ళందరూ ఈ క్యాంపెయిన్ లో భాగం అవ్వడం సినిమాకు చాలా పెద్ద ప్లస్ పాయింట్. స్వప్న సినిమాస్ వారి ప్రమోషనల్ ప్లానింగ్ ఎంత షార్ప్ గా ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది. సోషల్ మీడియా వేదికగా సినిమా టైటిల్ ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లారు. స్టార్స్ పర్సనల్ ఎమోషన్స్ ని సినిమాకు కనెక్ట్ చేయడం స్మార్ట్ మూవ్ అని చెప్పాలి.
డిసెంబర్ 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు కావాల్సిన బజ్ అయితే వచ్చేసింది. ఈ డిజిటల్ క్యాంపెయిన్ సక్సెస్ అయ్యింది కానీ, ప్రభాస్ ఆన్సర్ వచ్చాక అది ఇంకా ఏ రేంజ్ కు వెళ్తుందో చూడాలి. రోషన్ ని స్క్రీన్ మీద ఛాంపియన్ గా చూడటానికి ఆడియెన్స్ రెడీ అవుతున్నారు, మరి కంటెంట్ ఆ అంచనాలను అందుకుంటుందో లేదో తెలియాలంటే క్రిస్మస్ వరకు ఆగాల్సిందే.
