Begin typing your search above and press return to search.

జబర్దస్త్ పుష్కర ఈవెంట్.. చమ్మక్ చంద్ర ఎమోషనల్ కామెంట్స్!

అయితే ఇందులో భాగంగా జబర్దస్త్ 12 ఇయర్స్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన తాజా ప్రోమోలో చమ్మక్ చంద్ర మాట్లాడిన మాటలు చాలామందిని భావోద్వేగానికి గురి చేసాయి.

By:  Madhu Reddy   |   6 Aug 2025 3:45 PM IST
జబర్దస్త్ పుష్కర ఈవెంట్.. చమ్మక్ చంద్ర ఎమోషనల్ కామెంట్స్!
X

దశాబ్ద కాలానికి పైగా బుల్లితెర ప్రేక్షకులను నిర్విరామంగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్న ఏకైక షో జబర్దస్త్..ఈ షో ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది కూడా. ఎంతోమంది కమెడియన్లకి ఈ షో ద్వారా అవకాశాలు వచ్చి, ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచి స్థాయికి వచ్చారు. అయితే అలాంటి జబర్దస్త్ షో ఇప్పుడు 12 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా జబర్దస్త్ 12 ఇయర్స్ సెలబ్రేషన్స్ అనే ఒక ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి జబర్దస్త్ షో ప్రారంభించినప్పుడు కమెడియన్స్ గా చేసిన వారిని మొదలుకొని ఇప్పటివరకు ఈ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించారు.. ముందు నుండి ఉన్న ప్రతి ఒక్కరిని ఆహ్వానించారు.

అయితే ఈ ఈవెంట్ లో రోజా , సుధీర్ వంటి కొంతమంది మిస్ అయినప్పటికీ ఈవెంట్ లో మాత్రం ఫుల్ రచ్చ రచ్చ చేసినట్టు ఇప్పటికే విడుదలైన ప్రోమోలు చూస్తే అర్థమవుతుంది. అయితే ఇందులో భాగంగా జబర్దస్త్ 12 ఇయర్స్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన తాజా ప్రోమోలో చమ్మక్ చంద్ర మాట్లాడిన మాటలు చాలామందిని భావోద్వేగానికి గురి చేసాయి. ఇక ఈ ప్రోమోలో ఏముందంటే.. తాజాగా విడుదలైన జబర్దస్త్ పుష్కర ఈవెంట్ ప్రోమోలో జబర్దస్త్ కి తమను పరిచయం చేసిన చాలామంది టీం లీడర్ల కాళ్లు కడిగారు టీమ్ మెంబర్స్. అలా హైపర్ ఆది అదిరే అభి కాళ్లు కడిగారు.అలాగే చమ్మక్ చంద్ర టీం మెంబర్స్ అందరూ ఆయన కాళ్లు కడిగారు.

ఆ తర్వాత ఆయన మైక్ పట్టుకొని ఎమోషనల్ కామెంట్లు చేశారు. వేణు, ధనరాజ్, తాగుబోతు రమేష్ వంటి ఎంతోమంది నా స్నేహితులు ఆర్టిస్టులుగా సెటిల్ అయ్యారు. కానీ నాకెందుకు ఇలా అవుతుందని నిరుత్సాహపడ్డాను. అదే సమయంలో నాకు జబర్దస్త్ ప్రోగ్రాం లో అవకాశం వచ్చింది.ఇది నా లైఫ్ అండ్ డెత్ ప్రోగ్రాం.. దీనివల్ల నేను ఎంతో మంచి పేరును సంపాదించాను అంటూ తన లైఫ్ లో జబర్దస్త్ కి ఎంత ప్రాముఖ్యత ఉంది అనే విషయాన్ని తన మాటలతో తెలియజేశారు. ప్రస్తుతం చమ్మక్ చంద్ర మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక చమ్మక్ చంద్ర మాత్రమే కాకుండా జబర్దస్త్ షో ద్వారా ఇండస్ట్రీలో సక్సెస్ అయిన ప్రతి ఒక్కరూ తమ భావోద్వేగ క్షణాలను అందరితో పంచుకున్నారు. నవ్వులు, కన్నీళ్లు ఇలా ఎన్నో హ్యాపియెస్ట్ మూమెంట్స్ ఈ ప్రోమోలో కనిపించాయి. ఇక పూర్తి విషయాలు తెలియాలంటే కచ్చితంగా ఈవెంట్ మొత్తం చూడాల్సిందే. ప్రోమోలతోనే అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచారంటే ఈవెంట్ మరెంత అద్భుతంగా ఉండబోతోందో ఊహించవచ్చు.